స్టైల్‌గా హోలీ! | As the Holy Style! | Sakshi

స్టైల్‌గా హోలీ!

Mar 23 2016 1:04 AM | Updated on Sep 3 2017 8:20 PM

స్టైల్‌గా హోలీ!

స్టైల్‌గా హోలీ!

ఏడురంగులు.. ఏ రంగు ఎటువైపుగా మన మేనిని తడుముతుందో తెలియదు.

బ్యూటిప్స్

ఏడురంగులు.. ఏ రంగు ఎటువైపుగా మన మేనిని తడుముతుందో తెలియదు. కానీ, తెలుపు రంగు దుస్తులను ధరిస్తే ఊహించనన్ని రంగులు డిజైన్లు డిజైన్లుగా ఆనందపు కెరటాల్లా అంటుకుపోతాయి. అందుకని తెల్లని సల్వార్, రంగుల బాందినీ ప్రింటెడ్ చున్నీ ధరిస్తే చాలు పండగ సంబరం రెట్టింపు అవ్వాల్సిందే! కాలే జీ యువతులైతే షార్ట్స్, వదులుగా ఉండే టీ షర్ట్ లేదా కుర్తా ఈ పండగకు నిరభ్యంతరంగా ధరించవచ్చు. అయితే, తప్పనిసరిగా లైట్ వెయిట్ కాటన్ మెటీరియల్ దుస్తులను ఇందుకోసం ఎంచుకోవాలి.
 కొద్దిగా ఆలివ్ ఆయిల్: హోలీ ఆడటానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్‌ను మేనికి రాసుకోండి. ఇలా చేయడం వల్ల రంగుల వల్ల కలిగే మంట, దురద సమస్యలు ఉండవు. నూనె వల్ల కాసేపు చర్మం జిడ్డుగా అనిపిస్తుంది కానీ శుభ్రపరుచుకోవడం చాలా సులువు. చర్మకాంతి కూడా తగ్గదు. హోలీ రంగునీళ్ల నుంచి, ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ మార్కెట్లో లభిస్తుంది. దీనిని ఉపయోగించవచ్చు.

హెయిర్ స్టైల్: జుట్టును లూజ్‌గా వదిలేస్తే రంగులు అంటుకుపోయి, వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. హోలీ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకని ఫ్రెంచ్ పోనీటెయిల్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. జుట్టు గురించిన ఆందోళనా తగ్గుతుంది. పండగ కళ రావాలంటే పోనీటెయిల్‌కు పూసలు, కుందన్స్ ఉన్న క్లిప్ లేదా బ్యాండ్‌ను వాడచ్చు. హోలీ ఆడటానికి ముందు జుట్టుకు కండిషనర్ వాడితే ఆ తర్వాత పాడవుతుందనే బెంగ ఉండదు. లేదంటే ముందుగా వెచ్చని కొబ్బరి నూనెను తలకంతా బాగా పట్టించాలి. దీనివల్ల వెంట్రుకలు మాయిశ్చరైజర్‌ను కోల్పోవు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement