అన్‌ వాంటెడ్ చూపుల్ని దులిపేయండి | Remove Unwanted Hair Permanently | Sakshi
Sakshi News home page

అన్‌వాంటెడ్ చూపుల్ని దులిపేయండి

Published Wed, Sep 11 2013 11:09 PM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

అన్‌ వాంటెడ్ చూపుల్ని దులిపేయండి

అన్‌ వాంటెడ్ చూపుల్ని దులిపేయండి

బిడ్డను చంకలో వేసుకుని నిలబడమనండి మగాళ్లను!
 బాబోయ్ చూడలేం.
 బైక్‌ని కిక్ కొట్టి రయ్యిన పోనివ్వమనండి ఆడవాళ్లను.
 అస్సలు చూడకుండా ఉండలేం!
 ఎందుకని?
 ఏంటో మరి!
 గాళ్స్... ప్యాంటు షర్టు వేసుకున్నా...
 లుంగీ ఎగ్గట్టి ‘బస్తీ మే సవాల్’ అన్నా...
 పాన్ నములుతూ ‘డాన్’ పాట ఎత్తుకున్నా...
 ఆఖరికి ఎన్ని మగవేషాలు వేసినా...
 అందంగానే ఉంటుంది. అపురూపంగానూ అనిపిస్తుంది.
 అయితే ఒక్క విషయంలో మాత్రం...
 అమ్మాయిలు మగరాయుళ్లలా కాకుండా, మహరాణుల్లా ఉండాలనుకుంటారు!
 ఏమిటా ఒక్క విషయం.
 స్కిన్!
 మృదువైన, కోమలమైన తమ చర్మంపై వారు  ఈగను కూడా వాలనివ్వరు.
 అలాంటిది... పదేపదే ‘అన్‌వాంటెడ్’ చూపులు వాలుతుంటే?
 నో ప్రాబ్లమ్.
 ఆ చూపుల్ని వెంట్రుకల్లా దులిపేసే మెథడ్స్  ఈవారం ‘ముస్తాబు’లో...

 
 తల మీద వెంట్రుకలు పెంచుకోవడానికన్నా, ఒంటిపై వెంట్రుకలను తొలగించుకోవడానికి చాలా మంది సౌందర్యశాలలకు వెళుతుంటారు. రోమాలను తొలగించుకోవడానికి ఎంతటి నొప్పి, మంటనైనా భరిస్తుం టారు. ఇప్పుడే కాదు అవాంఛిత రోమాలను తొలగించడానికి ప్రాచీనకాలం నుంచి మనవాళ్లు ఎన్నో పద్ధతులను అనుసరించేవారు. నలుగుపిండి నుంచి లేజర్ వరకు పురోగమించిన ఆ పరిణామక్రమం తీరుతెన్నులివి...
 
 నలుగు: స్నానం చేయడానికి ముందు శనగపిండి లేదా బియ్యప్పిండిని తడి చేసి ఒంటికి రాసుకొని, మర్దనా చేసేవారు. దీనివల్ల మురికితో పాటు కొంతవరకు రోమాలు ఊడి వచ్చేవి. ఈ ప్రక్రియ మంచిదే అయినప్పటికీ రోమాలను నలుగుపిండి పూర్తిగా తొలగించదు. అందుకే తాత్కాలికంగా రోమాలను తొలిగించేం దుకు ప్లక్కింగ్, షేవింగ్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్.. వంటి ప్రక్రియలను వచ్చాయి.
 
 వ్యాక్సింగ్: సాధారణ వేడితో ఉన్న మైనాన్ని రోమాలు ఉన్న శరీర భాగంపై పూసి, మందపు వస్త్రాన్ని లేదా వ్యాక్స్ షీట్‌ను ఆ మైనంపై వేసి, అదిమి లాగడంతో వెంట్రుకలు ఊడి వచ్చేస్తా యి. వెంట్రుక పెరుగుదలను బట్టి ప్రతి 20, 30 రోజులకోసారి వ్యాక్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వెంట్రుక పెరుగుదల తగ్గినప్పటికీ నొప్పి, మంట, చర్మంపై చిన్న చిన్న కురుపులు, ర్యాష్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు రావడం చూస్తుంటాం. పార్లర్‌‌స లో సరైన శుభ్రత పాటించకపోతే ఇతర ఇన్ఫెక్షన్లు రావచ్చు. మార్కెట్‌లోని హెయిర్ రిమూవల్ క్రీమ్స్, లోషన్‌‌స వాడినా మళ్లీ మళ్లీ వచ్చే రోమాలు చికాకు పుట్టిస్తూనే ఉంటాయి. కొన్నాళ్లకు చర్మం గరుకుగానూ మారుతుంది.
 
 థ్రెడ్డింగ్: రెండు దారాల సాయంతో వెంట్రుకలను తొలగించే ప్రక్రియల థ్రెడ్డింగ్. దీని వల్ల చర్మంపై ర్యాష్, నొప్పి, మంట  వస్తుంటుంది. థ్రెడ్‌తో లాగడం వల్ల సాగి, చర్మం వదులు అయ్యే అవకాశాలు అధికం. ఈ పద్ధతిని కనుబొమలు, గడ్డం, నుదురు, పెదవుల చుట్టూత అనుసరిస్తుంటారు.
 
 ఎలక్ట్రోలసిస్: ఈ పద్ధతిలో 30 నుంచి 40 సెషన్స్ పడతాయి. సన్నని నీడిల్ తో చేసే ఈ చికిత్సలో నొప్పి విపరీ తంగా ఉంటుంది. చర్మంపై మచ్చలు కూడా పడేవి. అందుకే ఈ పద్ధతి అంతగా ప్రాచుర్యం పొందలేదు.
 
 లేజర్:  కాంతి కిరణాలతో ఫాలికల్ లోని వెంట్రుకను రిమూవ్ చేస్తారు. ఈ పద్ధతిని సరిగ్గా అనుసరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో చాలామంది మహిళల్లో పీసీఓడీ ఇతర గైనిక్ సమస్యలు ఎక్కువై హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వెంట్రుకల పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. వీరు ముందుగా డాక్టర్ సలహా తీసుకొని, చికిత్సలో తీసుకోవాలి. అంతర్గతంగా లేజర్ చికిత్స సాధ్యపడదు కాబట్టి ఈ చికిత్స పట్ల ఓపిక, జాగ్రత్తలు పాటించడం అవసరం.
 
 లేజర్‌కి ముందు... లేజర్ కన్‌సల్టెంట్‌ని సంప్రదించి, సలహా తీసుకోవాలి. బ్లీచింగ్, షేవింగ్, థ్రెడ్డింగ్ పద్ధతులేవీ అనుసరించకూడదు. ఎండలో తిరగకపోవడం, వేడినీటితో స్నానం చేయకపోవడం, కెమికల్ క్రీములు వాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.  
 
 లేజర్‌కి తర్వాత.. క్లినిక్‌లోనే ఐస్ కూలింగ్ ఇస్తారు. మెడికేటెడ్ క్రీమ్స్ వాడతారు. బయటకు వచ్చాక ఎండకు తిరగకూడదు. బ్లీచ్, ఇతర సౌందర్య లేపనాలను వాడకూడదు. ఎండకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ను వాడాలి. ఏడు రోజుల తర్వాత తమకు నప్పే బ్యూటీ క్రీములు వాడుకోవచ్చు. సాధారణ బ్యూటీ సెలూన్స్‌లో కన్నా సర్టిఫైడ్ కంపెనీస్‌తో ట్రీట్‌మెంట్ తీసుకుంటే మంచి పరిష్కారం లభిస్తుంది. మగవారికైతే... ఎక్కువ సెషన్స్ అవ సరం పడతాయి. మగవారు ఎక్కు వగా బియార్డ్ షేప్, మోడల్స్ ఫుల్ బాడీ లేజర్ చికిత్స చేయించుకుంటారు. అప్పర్‌లిప్, చిన్ అంటూ విడి విడిగానూ, ఫుల్ బాడీ ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. చికిత్స చేసే విధానం బట్టి ఖరీదు ఉంటుంది.
 
శాశ్వత పరిష్కారం!


 అడ్వాన్స్‌డ్ లేజర్: లేజర్ వల్ల కెరటోసిస్ పైలారిస్ అని భుజాల మీద, తొడల మీద సన్నని కురుపుల్లాంటివి వస్తాయి. లేజర్ హై రిడక్షన్‌తో వీటినీ తగ్గించవచ్చు. రోమాల నివార ణకు శాశ్వత పరిష్కారం అడ్వాన్‌‌సడ్ లేజర్ చికిత్స. ‘డియోడ్ లేజర్’ అనే అడ్వాన్‌‌సడ్ ప్రక్రియలో నొప్పి, మంట ఉండదు. చర్మం గరుకుగా మారదు. నల్లబడదు. ఈ పద్ధతిలో కొందరికి రోమాల సంఖ్యను బట్టి 10 నుంచి 12 సెషన్స్ అవసరం పడతాయి. నిర్దేశిత సమయం ప్రకారం సెషన్‌‌స తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. 16 ఏళ్ల వయసు నుంచీ ఈ చికిత్స చేయించు కోవచ్చు. ఏ ప్రక్రియలో అయినా వెంట్రుకను ఫాలికల్ నుంచి పూర్తిగా తొలగించడానికి ఒక్క సెషన్ సరిపోదు. మొదట నెలకు రెండు, తర్వాత వెంట్రుక పెరుగు దలను బట్టి ఆరు వారాలకు ఒక సెషన్ ఉంటుంది. సెషన్‌‌స పూర్తయిన తర్వాత మరో ఆరునెలలు మెయింటెనెన్స్ సెషన్ ఉంటుంది. లేజర్ సెషన్స్ పూర్తయ్యేసరికి 2-3 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత మళ్లీ లేజర్ అవసరం రాదు.
 
 
 వెంట్రుక వృద్ధి అయ్యే సమయం లో లేజర్‌ను ఉపయోగిస్తే హెయిర్ ఫాలికల్ లేజర్ లైట్‌ను అబ్జార్‌‌బ చేసుకుని, మంచి ఫలితాన్ని ఇస్తుంది.  
 
 కంటికి లేజర్ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తపడతారు. అందు కని లేజర్ చికిత్సలో కనుబొమలను షేప్ చేయరు. వీటికి థ్రెడ్డింగ్ మాత్రమే పరిష్కారం.  
 
 గతంలో ఛామనచాయగా ఉన్నవారికి కూడా లేజర్ చికిత్స చేసేవారు కాదు. ఇప్పుడు ఈ అడ్వాన్‌‌సడ్ పద్ధతి ద్వారా డార్‌‌క స్కిన్, పిగ్మెంటేషన్ ఉన్నవారికి కూడా చికిత్స చేయవచ్చు. అయితే శరీరం మీద వెంట్రుకలు తెల్లబడితే లేజర్ పనిచేయదు. అందుకే 40-45 ఏళ్లలోపు వయసున్న వారు ఈ చికిత్స చేయించుకోవడం మంచిది.
 
 - డా. షాను, డెర్మటాలజిస్ట్, కాయా స్కిన్ క్లినిక్
 
 నలుగుపిండి మేలు...


 స్నానం చేసేముందు పసుపు, ఆవపిండి, ఉలవపిండి, కరక్కాయ పొడి, మంచి గంధం, మారేడు పత్రాల పొడి కలిపి ఉపయోగించాలి. ఈ పొడి కాస్త గరుకుగా ఉండాలి. లేదంటే దీంట్లో బియ్యప్పిండి, శనగపిండి కలుపుకోవచ్చు. ఈ పిండిలో కొద్దిగా నువ్వులనూనె కలిపి రోమాలు ఉన్న చోట రాసి, రివర్స్ డెరైక్షలో మర్దనా చేయాలి. దీనివల్ల వెంట్రుక సులువుగా వచ్చేస్తుంది. నువ్వులనూనెకు బదులు ఆవుపాల మీగడ కూడా కలుపుకోవచ్చు. అయితే పిండి మరీ తడిగా కాకుండా పొడిగా, గరుకుగా ఉండాలి. పీసీఓడీ వంటి సమస్యల వల్ల స్త్రీలలో ఆండ్రోస్ హార్మోన్లు రిలీజ్ అయ్యి గడ్డాలు, మీసాలు వస్తుంటాయి. ఏ కారణం వల్ల అవాంఛిత రోమాలు వస్తున్నాయో తెలుసుకొని మందులు వాడాలి. కడుపులోకి  అయితే... స్పూనుడు శతావరి చూర్ణాన్ని పావుకప్పు పాలలో కలిపి (చక్కెర కూడా కలుపుకోవచ్చు) ఉదయం సాయంత్రం తాగాలి. స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వచ్చే అనర్థాలను ఈ చూర్ణం నివారిస్తుంది.
 - డా.వి.ఎల్.ఎన్.శాస్త్రి, ఆయుర్వేద వైద్యులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement