Methods
-
Vinayaka Chavithi 2024: బుజ్జి గణపయ్యకు.. బొజ్జ నిండా!
రేపే వినాయక చవితి. ఉదయం చంద్రుడిని చూడవద్దు. చందమామ లాంటి కుడుములు చేద్దాం. వినాయకుడికి నివేదన చేద్దాం. ఓ బొజ్జ గణపయ్యా! నీ బంటు నేనయ్యా!! ఉండ్రాళ్లపై దండు పంపమని స్తోత్రం చదువుదాం!!ఉండ్రాళ్లు..కావలసినవి..బియ్యపు రవ్వ– కప్పు;నీరు – 2 కప్పులు;పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు;నెయ్యి– టీ స్పూన్;ఉప్పు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు (ఇష్టమైతేనే)తయారీ..– శనగపప్పును కడిగి 20 నిమిషాల సేపు నీటిలో నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి అందులో శనగపప్పు వేసి వేయించాలి.– శనగపప్పు దోరగా వేగిన తర్వాత అందులో నీరు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి.– నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి, రవ్వ వేసి ఉండలు లేకుండా గరిటెతో కలపాలి.– కొబ్బరి తురుము వేసి సమంగా కలిసే వరకు కలిపి నీరు ఆవిరైపోయి రవ్వ దగ్గరగా అయిన తర్వాత దించేయాలి.– వేడి తగ్గిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని గోళీలుగా చేస్తే ఉండ్రాళ్లు రెడీ.పూర్ణం కుడుములు..కావలసినవి..బియ్యప్పిండి– కప్పు;నీరు – కప్పు;నెయ్యి – టీ స్పూన్;ఉప్పు – చిటికెడు. పూర్ణం కోసం... పచ్చి శనగపప్పు – అర కప్పు; నీరు – కప్పు;బెల్లం పొడి– ముప్పావు కప్పు;పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు;యాలకుల పొడి– అర టీ స్పూన్‌తయారీ..– శనగపప్పును కడిగి రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, చల్లారిన తర్వాత నీటిని వంపేసి శనగపప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి.– ఈ పొడి డ్రైగా ఉండదు, కొద్దిపాటి తడిపొడిగా ఉంటుంది.– ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కరిగే వరకు మరిగించాలి.– కరిగిన తర్వాత మరొకపాత్రలోకి వడపోయాలి.– బెల్లం నీటిలో శనగపప్పు పొడి, కొబ్బరి తురుము వేసి గరిటెతో కలుపుతూ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి.– చివరగా యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.– చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గోళీలుగా చేస్తే పూర్ణం రెడీ.ఇక కుడుముల కోసం..– ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో ఉప్పు, నెయ్యి వేసి వేడి చేయాలి.– నీరు మరిగేటప్పుడు స్టవ్ ఆపేసి బియ్యప్పిండి వేసి గరిటెతో కలపాలి.– వేడి తగ్గిన తరవాత చేత్తో మర్దన చేస్తూ చపాతీల పిండిలా చేసుకుని ఎనిమిది భాగాలు చేయాలి.– ఒక్కో భాగాన్ని గోళీలాగ చేసి పూరీలా వత్తాలి.– ఇందులో పూర్ణం పెట్టి అంచులు మూసేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి.– ఒక వెడల్పు పాత్రకు నెయ్యి రాసి పూర్ణకుడుములను అమర్చాలి.– ప్రెషర్ కుకర్‌లో నీరు పోసి కుడుముల పాత్ర పెట్టి మూత పెట్టి ఎనిమిది నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆపేయాలి.– చల్లారిన తర్వాత తీసి వినాయకుడికి నివేదన చేయాలి. -
Tasty Sweet Corn: గింజ గింజలో.. రుచి!
మార్కెట్లో స్వీట్ కార్న్ రాశులుగా పోగయి ఉన్నాయి. బలవర్ధకమే... కానీ రోజూ ఉడికించి తినాలంటే బోర్. కొంచెం వెరైటీగా ప్రయత్నం చేస్తే... పిల్లలు లంచ్‌బాక్స్‌ను ప్రేమిస్తారు... ఈవెనింగ్ స్నాక్ కోసం ఎదురుచూస్తారు.చీజ్ బాల్స్..కావలసినవి:బంగాళదుంప – 150 గ్రా (పెద్దది ఒకటి);మొక్కజొన్న గింజలు – వంద గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేతగా ఉండాలి;చీజ్ – 50 గ్రాములు;మిరియాల పొడి– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;ఆరెగానో పౌడర్ – అర టీ స్పూన్;వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్;మైదా లేదా శనగపిండి – 4 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;నూనె – 3 టేబుల్ స్పూన్లు;తయారీ..– బంగాళదుంపను ఉడికించి తొక్క తీసి చిదిమి పక్కన పెట్టాలి.– మొక్కజొన్న గింజలను ఉడికించి నీటిని వంపేసి పక్క పెట్టాలి. చీజ్‌ను తురమాలి.– ఒక పాత్రలో బంగాళదుంప, మొక్కజొన్న గింజలు, శనగపిండి, చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఆరెగానో వేసి కలపాలి.– రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు, మిరియాలపొడి కలుపుకోవచ్చు.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో పావు టీ స్పూన్ నూనె వేయాలి.– పెనం, నూనె బాగా వేడయ్యే లోపు బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న గోళీలంత బాల్స్ చేసి పక్కన పెట్టాలి.– నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో గోళీని ఒక్కో గుంతలో పెట్టి మూత పెట్టాలి.– మీడియం మంట మీద ఓ నిమిషం పాటు కాలనిచ్చి మూత తీసి ప్రతి బాల్నీ తిరగేయాలి.– తిరగేసిన తర్వాత మూత పెట్టకుండా రెండో వైపు కూడా ఎర్రగా కాలనిచ్చి తీయాలి.– వేడిగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.గమనిక: గుంత పొంగనాల పెనం లేకపోతే మామూలు బాణలిలో నూనె వేడి చేసి చీజ్ బాల్స్‌ని ఎర్రగా ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి.ఫ్రైడ్ రైస్..కావలసినవి:బాసుమతి బియ్యం – 200 గ్రాములు;నూనె – అర టీ స్పూన్;నీరు – 3 కప్పులు;మొక్క జొన్న గింజలు – 300 గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేత గింజలు);ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;ఉల్లికాడల ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు;సెలెరీ లేదా కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు;క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు;మిరియాల పొడి– టీ స్పూన్;సోయాసాస్– టేబుల్ స్పూన్;ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నెయ్యి లేదా నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు.తయారీ..– బియ్యాన్ని కడిగి 20 నిమిషాల సేపు నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో మూడు కప్పుల నీరు పోసి వేడి చేసి మరిగేటప్పుడు అందులో పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ ఆయిల్, కడిగి పెట్టిన బియ్యం వేయాలి.– అన్నం ఉడికిన తర్వాత వార్చి అన్నాన్ని ఒక పళ్లెంలో పోసి పక్కన పెట్టాలి.– అన్నం ఉడికేలోపు మరొక స్టవ్ మీద పాత్ర పెట్టి మొక్కజొన్న గింజలను ఉడికించాలి.– ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు పాత్ర లేదా పెద్ద బాణలి పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనె వేడి చేయాలి.– అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేసి దోరగా వేయించాలి.– తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, సెలెరీ తరుగు వేసి అవి వేగిన తర్వాత ఉడికించిన మొక్కజొన్న గింజలు, సోయాసాస్ వేసి దోరగా వేయించాలి.– అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు అందులో సగం అన్నం వేసి అన్నం మెతుకులు నలగనంత సున్నితంగా ఒక నిమిషం పాటు వేయించాలి.– ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా వేసి అంతా కలిసేటట్లు బాణలిని కదిలించి మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించేయాలి. -
భూముల రిజిస్ట్రేషన్లకు ఇక టైం స్లాట్!
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేలా జూన్ నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రిజిస్ట్రేషన్లకు టైం స్లాట్ విధానాన్ని తీసుకువస్తున్నామని.. ఇరుపక్షాలు ఆ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే చాలని పేర్కొన్నారు. తొలుత ఐదు మండలాల్లో, అనంతరం 30 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త విధానంలోని లోటుపాట్లను గుర్తించి, పొరపాట్లకు ఆస్కారం లేకుండా మార్పులు చేర్పులు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇక ‘ధరణి’వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. బుధవారం రిజిస్ట్రేషన్ల అంశంపై ప్రగతి భవన్లో మంత్రులు తుమ్మల, జూపల్లి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సీనియర్ అధికారులు, ఐఎల్ఎఫ్ఎస్ సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా నూతన రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఖరారు చేశారు. స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ భూములు విక్రయిస్తున్న వారు, కొంటున్న వారు ఒక్క సారి మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే సరిపోయేలా.. పాస్‌బుక్కులు, రిజిస్ట్రేషన్ కాగితాలు కొరియర్లో నేరుగా ఇంటికే వచ్చేలా నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ఖరారు చేశారు. ‘‘భూమిని అమ్మేవారు, కొనేవారు ముందుగా సబ్ రిజిస్ట్రార్ అపాయింట్మెంట్ కోరాలి. వారికి స్లాట్ కేటాయిస్తారు. ఆ స్లాట్ ప్రకారం ఇచ్చిన తేదీ, సమయానికి ఇద్దరూ కార్యాలయానికి చేరుకోవాలి. తమ సేల్‌డీడ్‌ను, పాసు పుస్తకాలను సమర్పించాలి. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అమ్మినవారి పాస్ బుక్కు నుంచి రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని తీసేస్తారు. కొన్నవారి పాస్ పుస్తకంలో దానిని జమ చేస్తారు. కొత్తగా భూములు కొనేవారైతే కొత్త పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. అదే రోజు పాస్ పుస్తకాన్ని తహసీల్దార్‌కు పంపుతారు. ఎమ్మార్వో వెంటనే ఆ వివరాలను నమోదు చేసుకుని, సంతకం చేస్తారు. తర్వాత తహసీల్దార్ తన కార్యాలయంలోనే ఉండే ఐటీ అధికారికి ఈ వివరాలు అందచేస్తారు. ఐటీ అధికారి ఈ వివరాలను నమోదు చేసి, ధరణి వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేస్తారు. అనంతరం సదరు పాస్ పుస్తకాన్ని తిరిగి సబ్ రిజిస్ట్రార్‌కు పంపుతారు. సబ్‌రిజిస్ట్రార్ ఎవరి పాస్ పుస్తకాన్ని వారికి, సేల్‌డీడ్‌ను భూమిని కొన్నవారికి కొరియర్ ద్వారా పంపుతారు..’’అని సమావేశంలో ముఖ్యమంత్రి వివరించారు. అందరికీ అందుబాటులో భూముల డేటా జూన్ నుంచి ప్రతీ మండలంలో రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని, అవి లేని 443 మండలాల్లో తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. వారికి ఇప్పటికే ఒక దఫా శిక్షణ కూడా ఇచ్చామని, మరో విడత శిక్షణ ఇస్తామని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన డేటాను ఉపయోగించి ‘ధరణి’వెబ్‌సైట్‌ను రూపొందించాలని, ప్రతీ మండల కేంద్రంలో ఉండే ఐటీæ అధికారి తన మండలంలో ఏ రోజు జరిగే మార్పులను అదే రోజు అప్డేట్ చేస్తారని తెలిపారు. ఇలా ధరణి వెబ్సైట్ నిరంతరం అప్డేట్ అవుతూనే ఉంటుందని.. అందులో భూములకు సంబంధించిన అన్ని వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీంతో పూర్తి పారదర్శకత వస్తుందన్నారు. మే 7 నుంచి పైలట్ ప్రాజెక్టు.. ధరణి వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి మే 7వ తేదీ నుంచి ఐదు మండలాల్లో.. మే 19 నుంచి గ్రామీణ జిల్లాకొక మండలం చొప్పున 30 మండలాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆయా చోట్ల ధరణి వెబ్సైట్ నిర్వహణలో వచ్చే ఇబ్బందులను అధ్యయనం చేసి, పరిష్కారాలను సిద్ధం చేస్తారు. ఈ మేరకు మార్పులు, చేర్పులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల వివరాలతో ‘ధరణి’వెబ్‌సైట్‌ను నిర్వహిస్తారు. ఈ వెబ్సైట్ నిర్వహణ కోసం సర్వీసు ప్రొవైడర్లతో ఈ నెల 20న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. మొదటి విడతలో ఐదు మండలాలు మొదటి విడతలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, కామారెడ్డి జిల్లా సదాశివనగర్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాల్లో పైలట్ ప్రాజెక్టును చేపడతారు. రెండో విడత మండలాలు.. రెండో విడతలో చేర్యాల (సిద్దిపేట), మానకొండూరు (కరీంనగర్), మేడిపల్లి (మేడ్చల్), నిర్మల్ రూరల్ (నిర్మల్), బాల్కొండ (నిజామాబాద్), ఎల్లారెడ్డి (కామారెడ్డి), ఆసిఫాబాద్ (ఆసిఫాబాద్), నెన్నెల(మంచిర్యాల), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతకుంట (సిరిసిల్ల), రాయికల్ (జగిత్యాల), రామచంద్రాపురం(సంగారెడ్డి), రామాయంపేట (మెదక్), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), కేసముద్రం (మహబూబాబాద్), నర్సంపేట (వరంగల్ రూరల్), హసన్‌పర్తి (వరంగల్ అర్బన్), రఘునాథపల్లి (జనగామ), ముదిగొండ(ఖమ్మం), పాల్వంచ రూరల్ (కొత్తగూడెం), చివ్వెంల (సూర్యాపేట), కట్టంగూర్ (నల్లగొండ), తుర్కపల్లి(యాదాద్రి), బిజినేపల్లి (నాగర్‌కర్నూల్), పెబ్బేరు (వనపర్తి), ఐజ (గద్వాల), దేవరకద్ర (మహబూబ్‌నగర్), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), నవాబ్‌పేట (వికారాబాద్), గుడిహత్నూర్ (ఆదిలాబాద్) మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తారు. -
ప్రాశస్త్యమా? ప్రచారమా?
-
అన్ వాంటెడ్ చూపుల్ని దులిపేయండి
బిడ్డను చంకలో వేసుకుని నిలబడమనండి మగాళ్లను! బాబోయ్ చూడలేం. బైక్‌ని కిక్ కొట్టి రయ్యిన పోనివ్వమనండి ఆడవాళ్లను. అస్సలు చూడకుండా ఉండలేం! ఎందుకని? ఏంటో మరి! గాళ్స్... ప్యాంటు షర్టు వేసుకున్నా... లుంగీ ఎగ్గట్టి ‘బస్తీ మే సవాల్’ అన్నా... పాన్ నములుతూ ‘డాన్’ పాట ఎత్తుకున్నా... ఆఖరికి ఎన్ని మగవేషాలు వేసినా... అందంగానే ఉంటుంది. అపురూపంగానూ అనిపిస్తుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం... అమ్మాయిలు మగరాయుళ్లలా కాకుండా, మహరాణుల్లా ఉండాలనుకుంటారు! ఏమిటా ఒక్క విషయం. స్కిన్! మృదువైన, కోమలమైన తమ చర్మంపై వారు ఈగను కూడా వాలనివ్వరు. అలాంటిది... పదేపదే ‘అన్వాంటెడ్’ చూపులు వాలుతుంటే? నో ప్రాబ్లమ్. ఆ చూపుల్ని వెంట్రుకల్లా దులిపేసే మెథడ్స్ ఈవారం ‘ముస్తాబు’లో... తల మీద వెంట్రుకలు పెంచుకోవడానికన్నా, ఒంటిపై వెంట్రుకలను తొలగించుకోవడానికి చాలా మంది సౌందర్యశాలలకు వెళుతుంటారు. రోమాలను తొలగించుకోవడానికి ఎంతటి నొప్పి, మంటనైనా భరిస్తుం టారు. ఇప్పుడే కాదు అవాంఛిత రోమాలను తొలగించడానికి ప్రాచీనకాలం నుంచి మనవాళ్లు ఎన్నో పద్ధతులను అనుసరించేవారు. నలుగుపిండి నుంచి లేజర్ వరకు పురోగమించిన ఆ పరిణామక్రమం తీరుతెన్నులివి... నలుగు: స్నానం చేయడానికి ముందు శనగపిండి లేదా బియ్యప్పిండిని తడి చేసి ఒంటికి రాసుకొని, మర్దనా చేసేవారు. దీనివల్ల మురికితో పాటు కొంతవరకు రోమాలు ఊడి వచ్చేవి. ఈ ప్రక్రియ మంచిదే అయినప్పటికీ రోమాలను నలుగుపిండి పూర్తిగా తొలగించదు. అందుకే తాత్కాలికంగా రోమాలను తొలిగించేం దుకు ప్లక్కింగ్, షేవింగ్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్.. వంటి ప్రక్రియలను వచ్చాయి. వ్యాక్సింగ్: సాధారణ వేడితో ఉన్న మైనాన్ని రోమాలు ఉన్న శరీర భాగంపై పూసి, మందపు వస్త్రాన్ని లేదా వ్యాక్స్ షీట్‌ను ఆ మైనంపై వేసి, అదిమి లాగడంతో వెంట్రుకలు ఊడి వచ్చేస్తా యి. వెంట్రుక పెరుగుదలను బట్టి ప్రతి 20, 30 రోజులకోసారి వ్యాక్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వెంట్రుక పెరుగుదల తగ్గినప్పటికీ నొప్పి, మంట, చర్మంపై చిన్న చిన్న కురుపులు, ర్యాష్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావడం చూస్తుంటాం. పార్లర్స లో సరైన శుభ్రత పాటించకపోతే ఇతర ఇన్ఫెక్షన్లు రావచ్చు. మార్కెట్లోని హెయిర్ రిమూవల్ క్రీమ్స్, లోషన్‌స వాడినా మళ్లీ మళ్లీ వచ్చే రోమాలు చికాకు పుట్టిస్తూనే ఉంటాయి. కొన్నాళ్లకు చర్మం గరుకుగానూ మారుతుంది. థ్రెడ్డింగ్: రెండు దారాల సాయంతో వెంట్రుకలను తొలగించే ప్రక్రియల థ్రెడ్డింగ్. దీని వల్ల చర్మంపై ర్యాష్, నొప్పి, మంట వస్తుంటుంది. థ్రెడ్‌తో లాగడం వల్ల సాగి, చర్మం వదులు అయ్యే అవకాశాలు అధికం. ఈ పద్ధతిని కనుబొమలు, గడ్డం, నుదురు, పెదవుల చుట్టూత అనుసరిస్తుంటారు. ఎలక్ట్రోలసిస్: ఈ పద్ధతిలో 30 నుంచి 40 సెషన్స్ పడతాయి. సన్నని నీడిల్ తో చేసే ఈ చికిత్సలో నొప్పి విపరీ తంగా ఉంటుంది. చర్మంపై మచ్చలు కూడా పడేవి. అందుకే ఈ పద్ధతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. లేజర్: కాంతి కిరణాలతో ఫాలికల్ లోని వెంట్రుకను రిమూవ్ చేస్తారు. ఈ పద్ధతిని సరిగ్గా అనుసరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో చాలామంది మహిళల్లో పీసీఓడీ ఇతర గైనిక్ సమస్యలు ఎక్కువై హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వెంట్రుకల పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. వీరు ముందుగా డాక్టర్ సలహా తీసుకొని, చికిత్సలో తీసుకోవాలి. అంతర్గతంగా లేజర్ చికిత్స సాధ్యపడదు కాబట్టి ఈ చికిత్స పట్ల ఓపిక, జాగ్రత్తలు పాటించడం అవసరం. లేజర్‌కి ముందు... లేజర్ కన్సల్టెంట్‌ని సంప్రదించి, సలహా తీసుకోవాలి. బ్లీచింగ్, షేవింగ్, థ్రెడ్డింగ్ పద్ధతులేవీ అనుసరించకూడదు. ఎండలో తిరగకపోవడం, వేడినీటితో స్నానం చేయకపోవడం, కెమికల్ క్రీములు వాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేజర్‌కి తర్వాత.. క్లినిక్‌లోనే ఐస్ కూలింగ్ ఇస్తారు. మెడికేటెడ్ క్రీమ్స్ వాడతారు. బయటకు వచ్చాక ఎండకు తిరగకూడదు. బ్లీచ్, ఇతర సౌందర్య లేపనాలను వాడకూడదు. ఎండకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ను వాడాలి. ఏడు రోజుల తర్వాత తమకు నప్పే బ్యూటీ క్రీములు వాడుకోవచ్చు. సాధారణ బ్యూటీ సెలూన్స్‌లో కన్నా సర్టిఫైడ్ కంపెనీస్‌తో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి పరిష్కారం లభిస్తుంది. మగవారికైతే... ఎక్కువ సెషన్స్ అవ సరం పడతాయి. మగవారు ఎక్కు వగా బియార్డ్ షేప్, మోడల్స్ ఫుల్ బాడీ లేజర్ చికిత్స చేయించుకుంటారు. అప్పర్‌లిప్, చిన్ అంటూ విడి విడిగానూ, ఫుల్ బాడీ ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. చికిత్స చేసే విధానం బట్టి ఖరీదు ఉంటుంది. శాశ్వత పరిష్కారం! అడ్వాన్స్డ్ లేజర్: లేజర్ వల్ల కెరటోసిస్ పైలారిస్ అని భుజాల మీద, తొడల మీద సన్నని కురుపుల్లాంటివి వస్తాయి. లేజర్ హై రిడక్షన్‌తో వీటినీ తగ్గించవచ్చు. రోమాల నివార ణకు శాశ్వత పరిష్కారం అడ్వాన్సడ్ లేజర్ చికిత్స. ‘డియోడ్ లేజర్’ అనే అడ్వాన్సడ్ ప్రక్రియలో నొప్పి, మంట ఉండదు. చర్మం గరుకుగా మారదు. నల్లబడదు. ఈ పద్ధతిలో కొందరికి రోమాల సంఖ్యను బట్టి 10 నుంచి 12 సెషన్స్ అవసరం పడతాయి. నిర్దేశిత సమయం ప్రకారం సెషన్స తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. 16 ఏళ్ల వయసు నుంచీ ఈ చికిత్స చేయించు కోవచ్చు. ఏ ప్రక్రియలో అయినా వెంట్రుకను ఫాలికల్ నుంచి పూర్తిగా తొలగించడానికి ఒక్క సెషన్ సరిపోదు. మొదట నెలకు రెండు, తర్వాత వెంట్రుక పెరుగు దలను బట్టి ఆరు వారాలకు ఒక సెషన్ ఉంటుంది. సెషన్స పూర్తయిన తర్వాత మరో ఆరునెలలు మెయింటెనెన్స్ సెషన్ ఉంటుంది. లేజర్ సెషన్స్ పూర్తయ్యేసరికి 2-3 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత మళ్లీ లేజర్ అవసరం రాదు. వెంట్రుక వృద్ధి అయ్యే సమయం లో లేజర్‌ను ఉపయోగిస్తే హెయిర్ ఫాలికల్ లేజర్ లైట్‌ను అబ్జార్బ చేసుకుని, మంచి ఫలితాన్ని ఇస్తుంది. కంటికి లేజర్ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తపడతారు. అందు కని లేజర్ చికిత్సలో కనుబొమలను షేప్ చేయరు. వీటికి థ్రెడ్డింగ్ మాత్రమే పరిష్కారం. గతంలో ఛామనచాయగా ఉన్నవారికి కూడా లేజర్ చికిత్స చేసేవారు కాదు. ఇప్పుడు ఈ అడ్వాన్సడ్ పద్ధతి ద్వారా డార్క స్కిన్, పిగ్మెంటేషన్ ఉన్నవారికి కూడా చికిత్స చేయవచ్చు. అయితే శరీరం మీద వెంట్రుకలు తెల్లబడితే లేజర్ పనిచేయదు. అందుకే 40-45 ఏళ్లలోపు వయసున్న వారు ఈ చికిత్స చేయించుకోవడం మంచిది. - డా. షాను, డెర్మటాలజిస్ట్, కాయా స్కిన్ క్లినిక్ నలుగుపిండి మేలు... స్నానం చేసేముందు పసుపు, ఆవపిండి, ఉలవపిండి, కరక్కాయ పొడి, మంచి గంధం, మారేడు పత్రాల పొడి కలిపి ఉపయోగించాలి. ఈ పొడి కాస్త గరుకుగా ఉండాలి. లేదంటే దీంట్లో బియ్యప్పిండి, శనగపిండి కలుపుకోవచ్చు. ఈ పిండిలో కొద్దిగా నువ్వులనూనె కలిపి రోమాలు ఉన్న చోట రాసి, రివర్స్ డెరైక్షలో మర్దనా చేయాలి. దీనివల్ల వెంట్రుక సులువుగా వచ్చేస్తుంది. నువ్వులనూనెకు బదులు ఆవుపాల మీగడ కూడా కలుపుకోవచ్చు. అయితే పిండి మరీ తడిగా కాకుండా పొడిగా, గరుకుగా ఉండాలి. పీసీఓడీ వంటి సమస్యల వల్ల స్త్రీలలో ఆండ్రోస్ హార్మోన్లు రిలీజ్ అయ్యి గడ్డాలు, మీసాలు వస్తుంటాయి. ఏ కారణం వల్ల అవాంఛిత రోమాలు వస్తున్నాయో తెలుసుకొని మందులు వాడాలి. కడుపులోకి అయితే... స్పూనుడు శతావరి చూర్ణాన్ని పావుకప్పు పాలలో కలిపి (చక్కెర కూడా కలుపుకోవచ్చు) ఉదయం సాయంత్రం తాగాలి. స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వచ్చే అనర్థాలను ఈ చూర్ణం నివారిస్తుంది. - డా.వి.ఎల్.ఎన్.శాస్త్రి, ఆయుర్వేద వైద్యులు