బ్యూటిప్స్
మేకప్ పూర్తిగా తొలగించిన తరువాత గోరువెచ్చటి నీటిలో దూది, లేదంటే మెత్తని కాటన్ క్లాత్‌ను ముంచి గట్టిగా పిండాలి. ఆ తడి క్లాత్‌తో మరోసారి ముఖాన్ని తుడుచు కోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచు కోవాలి. మేకప్ తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ని తప్పక రాసుకోవాలి. దీని వల్ల ముఖ చర్మం పొడిబారకుండా ఉంటుంది.
మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూ పేపర్, సేఫ్టీ పిన్స్... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్-అప్’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. అప్పుడు మేకప్ చెదిరినా, తీసివేయాలన్నా ఇబ్బందిపడే అవసరం ఉండదు.