Cotton cloth
-
సిరిసిల్ల బ్రాండ్ బ్యాండేజీ..!
సిరిసిల్ల: మార్కెట్లో ఏ బట్టకు డిమాండ్ ఉంటే, ఆ బట్టను కాలానికి అనుగుణంగా ఉత్పత్తి చేస్తేనే పోటీ ప్రపంచంలో మనుగడ ఉంటుంది. ఈ వ్యాపార సూత్రాన్ని ఆకలింపు చేసుకున్న సిరిసిల్లలోని కొందరు వ్రస్తోత్పత్తిదారులు కాటన్ బట్ట ఉత్పత్తికి స్వస్తి పలికారు. బ్యాండేజీ బట్ట ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఈ బట్టను శుద్ధి చేసి, ప్రాసెసింగ్ చేసిన తర్వాత నీట్‌గా స్టెరలైజ్లో ప్యాకింగ్ చేసి ఆస్పత్రుల్లో గాయాలకు కట్లు కట్టేందుకు వినియోగిస్తారు. వినాయకచవితి సందర్భంగా వివిధ రంగుల్లో ఈ బ్యాండేజీ బట్టను ప్రాసెస్ చేసి వినియోగిస్తారు. సిరిసిల్లలో కొత్తగా ఆలోచించే కాటన్ యజమానులు బ్యాండేజీ బట్ట ఆర్డర్లు తీసుకొని సాంచాలపై కొత్త రకం బట్టను ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్ల వ్రస్తోత్పత్తి రంగంలో వచ్చిన ఈ మార్పుతో నేతన్నలకు మెరుగైన ఉపాధి లభిస్తున్నది. సర్కారు వైపు చూడకుండా.. సిరిసిల్ల పాలిస్టర్ యజమానులు, ఆసాములు ప్రభు త్వం ఇచ్చే వస్త్రోత్పత్తి ఆర్డర్లకు చూస్తుండగా, కాటన్ వస్త్రోత్పత్తిదారులు సొంత వ్యాపారం నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలిస్టర్ వ్రస్తోత్పత్తిదారులు బతుకమ్మ చీరలు, ఆర్వీఎం, రంజాన్, క్రిస్మస్ వంటి ఆర్డర్లతో కాలం వెళ్లదీశారు. కాటన్ వస్త్రపరిశ్రమకు ప్రభుత్వ పరంగా ఆర్డర్లు రాకపోయినా, సొంతంగా ఆర్డర్లు సంపాదించుకొని మార్కెటింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు 160 డయింగ్(అద్దకం) యూనిట్లతో సిరిసిల్ల కాటన్ పరిశ్రమ ఉపాధి కేంద్రంగా ఉండేది. కానీ ప్రస్తుతం 50 డయింగ్ యూనిట్లకు చేరింది. ఇలాంటి తరుణంలో కాటన్ వస్త్రవ్యాపారులు కొత్త కం బ్యాండేజీ బట్టను ఉత్పత్తి చేస్తున్నారు.సాంచా నడుపుతున్న ఇతని పేరు చిలుక మల్లేశం. సిరిసిల్లలో కాటన్ బట్టను ఉత్పత్తి చేసే మల్లేశం కొత్తగా బ్యాండేజీ బట్టను తక్కువ పిక్కుల (పోగులు)తో బట్ట జాలి(రంధ్రాలు) ఉండే విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో లంగాల బట్టను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.22 లభించేది. కానీ దీనికి డిమాండ్ లేదు. ప్రస్తుతం బ్యాండేజీ బట్టను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.19 లభిస్తున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. -
మహిళ కడుపులో కాటన్ గుడ్డను పెట్టి మర్చిపోయి కుట్లు వేయడంతో..
సాక్షి, మొయినాబాద్: ఆపరేషన్ చేసి ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చారు డాక్టర్లు. పురుటి నొప్పులతో వచ్చిన మహిళకు శస్త్రచికిత్స చేసి కడుపులో కాటన్ వస్త్రం పెట్టి కుట్లు వేశారు. పది రోజుల తర్వాత తమతో కాదని చేతులెత్తేశారు. చివరికి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆపరేషన్ చేసి కాటన్ గుడ్డను బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడింది. వివరాలివీ.. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన దండు మంగమ్మ డెలివరీ కోసం నవంబర్ 28న మండల పరిధిలోని భాస్కర ఆస్పత్రికి వెళ్లింది. 29న ఉదయం డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. ఆపరేషన్ సమయంలో కాటన్ గుడ్డను కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు వేశారు. పది రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచుకున్నారు. కుట్లు ఎంతకూ మానకపోవడంతోపాటు కడుపునొప్పి రావడంతో భర్త మాణిక్యం డాక్టర్లను ప్రశ్నించాడు. దీంతో ఎక్స్‌రేలు తీయిస్తూ, మందులు తెప్పిస్తూ కాలయాపన చేశారు. ఎంతకూ తగ్గకపోవడంతో చేసేదిలేక ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఈనెల 8న అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు సైతం కాదని చెప్పడంతో అదే రోజు రాత్రి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు స్కానింగ్ చేసి కడుపులో ఏదో గుడ్డ ఉందని గుర్తించారు. శుక్రవారం ఆపరేషన్ చేసి బయటికి తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. చదవండి: 50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’! డాక్టర్లను ప్రశ్నించిన భర్త మాణిక్యం మాణిక్యం, బంధువులతో కలిసి శనివారం సాయంత్రం భాస్కర ఆస్పత్రికి వచ్చి డాక్టర్లను నిలదీశారు. పెద్ద డాక్టర్లు లేరని.. సోమవారం వచ్చి మాట్లాడండి అంటూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లగొట్టారని మాణిక్యం ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంచందర్‌రావు వివరణ కోరగా రెండు రోజులుగా సెలవులో ఉన్నానని.. సంఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపడతామన్నారు. చదవండి: ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు -
ఖాదీ రవివర్మ
రవివర్మ చిత్రాలు గోడల మీద పెయింటింగ్స్‌గా, క్యాలెండర్లుగా కనిపించడం కొత్తకాదు. కాని అవి ఖాదీ వస్త్రాల మీదకు తర్జుమా కావడం పూర్తిగా కొత్త. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రవివర్మ ముని మనవరాలు రుక్మిణి వర్మ, డ్రస్ డిజైనర్ గౌరంగ్ షా ఖాదీ చీరల మీద రవివర్మ బొమ్మలను రూపు కట్టించారు. వీటి ప్రదర్శన ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ ముని మనుమరాలు రుక్మిణి వర్మ నాట్యకారిణి. భరతనాట్యం, కథక్, కథాకళి ప్రదర్శనలు అనేకం ఇచ్చారు. బెంగళూరులో డాన్స్ స్కూల్, ‘రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్’ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవివర్మ చిత్రాల ప్రదర్శన మీద ఆమె ముందు నుంచి కృషి చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం డ్రస్ డిజైనర్ గౌరంగ్ షా ఆమెను కలిసి ఒక ప్రతిపాదన చేశారు. ‘గాంధీజీ 150 జయంతి మరో ఐదేళ్లలో రానున్న సందర్భంగా ఆయనకు నివాళిగా ఖాదీ వస్త్రాల మీద రవివర్మ చిత్రాలను రూపుదిద్దుతాను. అందుకు అంతగా వ్యాప్తిలోకి రాని చిత్రాలు ఇవ్వండి’ అని ఆ ప్రతిపాదన సారాంశం. అందుకు సమ్మతించిన రుక్మిణి రవివర్మ చిత్రాల్లో అరుదైన ఇంత వరకు ఎక్కువగా ప్రదర్శితం కాని ముప్పై చిత్రాలను ఇచ్చారు. ఆ చిత్రాలను ఖాదీ వస్త్రం మీద ఆవిష్కరింప చేయడం అనే మహా యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు గౌరంగ్. ఐదేళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత ఆ బొమ్మలను ఖాదీ వస్త్రాల మీదకు తీసుకురాగలిగారు. ‘‘గాంధీజీ ఫాదర్ ఆఫ్ నేషన్. రవివర్మ ఫాదర్ ఆఫ్ ఆర్ట్. ఈ ఇద్దరి జయంతి–వర్థంతి ఒకే రోజు. గాంధీకి ఇష్టమైన ఖాదీలో రవివర్మ చిత్రాలను రూపొందించడానికి కారణం వాళ్లిద్దరినీ ఒక వేదిక మీదకు తీసుకు రావడమే. ఇందు కోసం రుక్మిణి వర్మను సంప్రదించినప్పుడు ఆమె వినూత్నమైన చిత్రాల హక్కులను ఇచ్చి మరీ ప్రోత్సహించారు. రవివర్మ చిత్రాల డిజిటల్ రూపాలను ఖాదీ వస్త్రాల మీద జాందానీ నేతలో పునఃసృష్టించాం. ఈ బొమ్మలు ఉన్న చీరల మొదటి ప్రదర్శనను 2019 అక్టోబర్ రెండవ తేదీన ముంబయిలో పెట్టాం. తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీలో ప్రదర్శించాం. ఇప్పుడు హైదరాబాద్‌లో పెట్టాము. వచ్చే నెల బరోడాలో ఉంది. ఇలా దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత విదేశాలకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. ’’ అన్నారు గౌరంగ్ షా. ప్రదర్శనలో... హైదరాబాద్ ‘సప్తపరి’్ణలో ప్రదర్శితమవుతున్న ముప్పై చిత్రాల్లో దాదాపుగా పాతిక చిత్రాలు స్త్రీ ప్రధానంగా ఉన్నాయి. రిద్ధి– సిద్ధిలతో వినాయకుడు, ఉయ్యాల ఊగుతున్న మోహిని, సఖులతో పరిహాసాల మధ్య శకుంతల, వనవాసంలో సీత, సుభద్రను ఓదారుస్తున్న అర్జునుడు, కేరళ సంప్రదాయ దుస్తులలో వీణ మీటుతున్న సరస్వతి మొదలైన చిత్రాలు చీరల మీద నేతలో ఒదిగిపోయాయి. ఒక చిత్రంలో కృష్ణుడి ఆస్థానంలో ఇరవై మంది కొలువుదీరి ఉన్నారు. ఒక్కొక్కరి ముఖంలో ఒక్కో భావం, కళ్లలో కూడా చిత్రవిచిత్రమైన భావాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భావాలు చీర మీద కూడా యథాతథంగా రూపుదిద్దుకున్నాయి. హరి–హర బేటీ చిత్రంలో అయితే ఒకే తల రెండుగా భ్రమింప చేస్తుంది. శివుడు అధిరోహించిన నంది వైపు నుంచి చూస్తే నంది తల కనిపిస్తుంది. విష్ణుమూర్తి వైపు నుంచి చూస్తే ఏనుగు తల కనిపిస్తుంది. రవివర్మ చిత్రకళలో చూపించిన ఇంతటి వైవిధ్యాన్ని నేతలో తీసుకురావడానికి నేతకారులకు మూడేళ్లు పట్టింది. 150/150 నేతలో ఆరువందల రంగులను ఉపయోగించారు. శ్రీకాకుళంలోని జాందానీ నేతకారుల చేతుల్లో వస్త్రం మీద రూపం పోసుకున్న చిత్రాలివి.– వాకా మంజులారెడ్డి -
ఆన్లైన్లో ఆప్కో వస్త్రాలు : గౌతమ్‌రెడ్డి
సాక్షి, ఏపీ సచివాలయం : ఆన్లైన్లో ఆప్కో వస్త్రాల కొనుగోలును పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రారంభించారు. ఇందుకోసం అమెజాన్‌తో ఆప్కో ఒప్పందం చేసుకుందన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై ఆప్కో, అమెజాన్ సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. అమెజాన్ సహాయంతో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతోందన్నారు. ఆప్కో నుంచి 104 రకాల చేనేత ఉత్పత్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. -
హర్ట్ చేయకండి
ఎప్పుడూ కనిపించే అమ్మాయి కూడా దుపట్టా మార్చగానే కొత్తగా కనిపిస్తుంది! దుపట్టాలోని విశేషమే అది. అయితే, మీరెంతో ఇష్టపడే దుపట్టాపై టమాటో సాసో, గ్రేవీనో, చాక్లెట్ మరకో పడితే వాటిని తేలిగ్గా తొలగించే ఉపాయాలు కూడా తెలిసుండాలి. అప్పుడే మీ దుపట్టా కొంచెం కూడా హర్ట్ అవకుండా మీరు ఆ మరకల్ని తొలగించుకోగలరు. కాటన్ దుపట్టాపై మరక పడితే: ఓ కప్పు గోరు వెచ్చని నీళ్లలో రెండు టేబుల్ స్ఫూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలియదిప్పండి. ఈ నీళ్లను దుపట్టాపై మరక పడిన చోట పోయండి. పదిహేను నిముషాలు ఆగాక చల్లటి నీటితో కడిగేయండి. అంతే. మరక మాయం! సిల్క్ దుపట్టాపై మరక పడితే: మరక పడిన చోట మొదట కొన్ని చుక్కల నీళ్లు పొయ్యండి. (చన్నీళ్లే). తర్వాత నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో మృదువుగా మరకపై రుద్దండి. తర్వాత ఎప్పటిలా ఉతికేయండి. అయితే అందుకు మీరు ఉపయోగించే బట్టల సబ్బు, లేదా పౌడర్ మరీ శక్తిమంతమైనది కాకుండా ఉండాలి. లేదా అది సిల్క్ దుస్తుల కోసమే తయారు చేసిన సబ్బు గానీ పౌడరు గానీ అయి ఉండాలి. నెట్ దుపట్టాపై మరక పడితే: ఒక పాత్రలోకి ఒక కప్పు చల్లటి నీటిని, ఒక టీ స్పూను (టేబుల్ స్పూను కాదు. గుర్తుంచుకోండి) తేలికపాటి డిటర్జెంట్ పౌడర్‌ను వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని దుపట్టాపై మరకపడిన చోట పోసి, వలయాకారంలో వేళ్లతో మృదువుగా రుద్దండి. మామూలుగానే మృదువుగా రుద్దాలి. ఇది నెట్ క్లాత్ కనుక మరి కాస్త మృదువుగా రుద్దాలి. టీ మరకలను, జ్యూస్ మరకలను కూడా ఈ మిశ్రమం పోగొడుతుంది. -
రాగి వస్తువులు మెరవాలంటే...
ఇంటిప్స్ రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దాలి. అలా చేస్తే అవి కొత్త వాటిలా మెరవడం ఖాయం.ప్లాస్క్‌లో గంటల తరబడి టీ కానీ కాఫీ కానీ పోసి ఉంచడం వల్ల అది శుభ్రపరిచేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఆ దుర్వాసనను పోగొట్టాలంటే డిష్వాషర్ కంటే ముందు దాన్ని మజ్జిగతో శుభ్రం చేయాలి. పచ్చి కొబ్బరి చిప్పలు ఒక వారం పాటు తాజాగా ఉండాలంటే రోజూ నిమ్మరసాన్ని ఆ చిప్పలకు రుద్దితే చాలు. రోజూ చేసుకునే వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడి కలిపితే వంట రుచిగా ఉండటంతో పాటు తినే వారికి విటిసిన్-సి అందుతుంది.పావుకప్పు బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని వెండిసామానుకు రాసి, మెత్తని కాటన్ క్లాత్‌తో తుడిస్తే తళతళ మెరుస్తాయి. -
బ్యూటిప్స్
మేకప్ పూర్తిగా తొలగించిన తరువాత గోరువెచ్చటి నీటిలో దూది, లేదంటే మెత్తని కాటన్ క్లాత్‌ను ముంచి గట్టిగా పిండాలి. ఆ తడి క్లాత్‌తో మరోసారి ముఖాన్ని తుడుచు కోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచు కోవాలి. మేకప్ తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ని తప్పక రాసుకోవాలి. దీని వల్ల ముఖ చర్మం పొడిబారకుండా ఉంటుంది. మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూ పేపర్, సేఫ్టీ పిన్స్... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్-అప్’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. అప్పుడు మేకప్ చెదిరినా, తీసివేయాలన్నా ఇబ్బందిపడే అవసరం ఉండదు. -
చేతులకూ కొంత టైమివ్వాలి!
బ్యూటిప్స్ మృదువైన ముఖం మీద నుంచి దృష్టి తామరతూడుల్లా ఉండాల్సిన చేతుల మీదకు మళ్లుతుంది. కానీ చాలామంది చేతుల మీద శ్రద్ధ పెట్టరు. దాంతో చేతులు గరుకుదేలి మొరటుగా తయారవుతాయి. ముఖం కోసం కేటాయించిన సమయంతోపాటు చేతులకూ టైమివ్వాల్సిందే. కొద్దిగా నీళ్ళు, టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించాలి. ఈ మిశ్రమం చేతులపై ఉండే మృత కణాలను, పొడి చర్మాన్ని తొలగించి చేతులను సున్నితంగా తయారు చేస్తుంది. గిన్నెడు నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతి నుంచి భుజాల వరకు రాయాలి. ఇలా వారానికి రెండుసార్లు చే స్తే చేతులు సున్నితంగా తయారవుతాయి. గోరువెచ్చని నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని కాటన్ క్లాత్‌తో గబగబారుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు రాలిపోతాయి. తర్వాత ఒక టీ స్పూన్ తేనెకి ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి చేతులకు రాయాలి. తరువాత చేతులకు ప్లాస్టిక్ బ్యాగ్స్ తొడుక్కొని అరగంట అలాగే ఉంచుకోవాలి. చేతులపై చర్మం మృదువుగా తయారవుతుంది. అరచేతులు పొడిబారినట్లయితే రాత్రి పడుకోబోయే ముందు రెండు చుక్కల కొబ్బరి నూనె అరచేతుల్లో వేసుకుని మర్దన చేసుకోవాలి. -
ఇంటిప్స్
కిచెన్, బాత్రూమ్ ట్యాప్స్పైన గారలా ఏర్పడుతుంటుంది. మురికిగా కనపడతాయి. నిమ్మకాయను సగానికి కోసి, అర ముక్కకు తగినంత ఉప్పు అద్ది, దాంతో ట్యాప్స్ని రుద్దాలి. తర్వాత కాటన్ క్లాత్‌తో తుడవాలి. మురికంతా పోయి కొత్తవాటిలా మెరుస్తాయి. ఉతికేటప్పుడు దుస్తుల రంగు పోకుండా ఉండాలంటే నీటిలో కొద్దిగా ఉప్పు, వెనిగర్ కలిపి వాటిని నానబెట్టి, తర్వాత ఉతకాలి. -
పత్తివైపు రైతన్న చూపు
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: జిల్లాలో పత్తి సాగు జోరందుకుంది. ధరలు ఆశాజనకంగా ఉండడం.. పంటసాగుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు పత్తిపై దృష్టిసారించారు. దీనికితోడు పంట సాగుకు పెద్దగా కష్టం ఉండకపోవడంతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో బోరుబావుల కింద సాగు చేపట్టారు. జిల్లాలో ప్రస్తుతం బోరుబావుల కింద చింతకొమ్మదిన్నె, కమలాపురం, పెండ్లిమర్రి, వల్లూరు, వీరపునాయునిపల్లె, వేంపల్లె, వేముల, తొండూరు, లింగాల, బి మఠం, పోరుమావిళ్ల, బద్వేలు మండలాల్లో అధికంగాను, మిగతా మండలాల్లో తక్కువగాను సాగు చేస్తున్నారు. దాదాపు 75 వేల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పత్తి పంటసాగైందని అధికారులు తెలిపారు. జిల్లాలో గత ఏడాది 85,235 ఎకరాలు పత్తి పంటను సాగు చేశారు. ఈ పంట నుంచి 7,02,340 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్లో ప్రారంభంలో క్వింటా రూ.3800లు ఉండేది. రానురాను క్వింటా రూ. 4800లుగా ధర పలుకుతోందని రైతులు తెలిపారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కు.. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న వాస్తవ ధరలను దళారులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై అసలు ధరను ఇవ్వడం లేదని రైతు లు వాపోతున్నారు. క్వింటా రూ 5100 ధర పలుకుతుండగా దాన్ని రూ. 4800లు మాత్రమే ప్రకటింపజేసి రైతులను నిలువునా ముంచుతున్నారని రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మార్కెట్లో ఉన్న ధర రైతులకు అందితే లాభాలు చవిచూస్తామని రైతులు అంటున్నారు. వేరుశనగ కంటే పత్తే మేలు.. పత్తి సాగుకు దుక్కులు,పశువుల ఎరువులు, సేంద్రీయ ఎరువులు, పత్తిగింజల కొనుగోలు తదితరవాటికి ఎకరానికి రూ. 22 వేలు పెట్టుబడి అవుతుందని రైతులు తెలిపారు. మార్కెట్లో క్వింటా ధర రూ. 5000లు పలికితే, ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని ఆ ప్రకారం రూ. 40 వేలు వస్తుందని రైతులు తెలిపారు. దీంతో పెట్టుబడులు పోను రూ. 18 వేలు ఆదాయం ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటే అదుకుంటోందని రైతులు తెలిపారు. -
ఎంబ్రాయిడరీ కన్నా లేసులు మిన్న
నూలు వస్త్రం వేసవికే ప్రత్యేకం. మిగతా కాలాల్లో దీనిని ఎక్కువ వాడలేం. తక్కువ రేటు ఉండే కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కువ ఖర్చుపెట్టి భారీగా ఎంబ్రాయిడరీ చేయించుకునే దానికన్నా క్రోషియా, జర్దోసీ, క్లాత్, నెట్ లేసులు, పెద్ద పెద్ద బటన్స్ వాడి చూడముచ్చటగా డిజైన్ చేసుకోవచ్చు. లెదర్ బ్యాగుల స్థానంలో క్లాత్ బ్యాగులు, జూట్, లినెన్ఫ్యాబ్రిక్తో చేసిన బ్యాగులు వాడుకోవచ్చు. ఫంకీ జువెలరీని ఇష్టపడేవారు మెటల్ ఆభరణాలను మానేసి ఉడెన్, బీడ్స్, టైట, నూలు దారాలతో తయారుచేసిన ఆభరణాలను ఎంచుకోవాలి. లైట్ మేకప్ అందంగానూ, సౌకర్యంగానూ ఉంటుంది. పర్ఫ్యూమ్స్ కూడా చాలా తక్కువ గాఢత కలిగినవే ఎంచుకోవాలి.