రాగి వస్తువులు మెరవాలంటే...
ఇంటిప్స్
రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దాలి. అలా చేస్తే అవి కొత్త వాటిలా మెరవడం ఖాయం.ప్లాస్క్‌లో గంటల తరబడి టీ కానీ కాఫీ కానీ పోసి ఉంచడం వల్ల అది శుభ్రపరిచేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఆ దుర్వాసనను పోగొట్టాలంటే డిష్‌వాషర్ కంటే ముందు దాన్ని మజ్జిగతో శుభ్రం చేయాలి. పచ్చి కొబ్బరి చిప్పలు ఒక వారం పాటు తాజాగా ఉండాలంటే రోజూ నిమ్మరసాన్ని ఆ చిప్పలకు రుద్దితే చాలు.
రోజూ చేసుకునే వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడి కలిపితే వంట రుచిగా ఉండటంతో పాటు తినే వారికి విటిసిన్-సి అందుతుంది.పావుకప్పు బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని వెండిసామానుకు రాసి, మెత్తని కాటన్ క్లాత్‌తో తుడిస్తే తళతళ మెరుస్తాయి.