ఇంటిప్స్
కిచెన్, బాత్రూమ్ ట్యాప్స్‌పైన గారలా ఏర్పడుతుంటుంది. మురికిగా కనపడతాయి. నిమ్మకాయను సగానికి కోసి, అర ముక్కకు తగినంత ఉప్పు అద్ది, దాంతో ట్యాప్స్‌ని రుద్దాలి. తర్వాత కాటన్ క్లాత్‌తో తుడవాలి.
మురికంతా పోయి కొత్తవాటిలా మెరుస్తాయి. ఉతికేటప్పుడు దుస్తుల రంగు పోకుండా ఉండాలంటే నీటిలో కొద్దిగా ఉప్పు, వెనిగర్ కలిపి వాటిని నానబెట్టి, తర్వాత ఉతకాలి.