
సాక్షి, ఏపీ సచివాలయం : ఆన్‌లైన్‌లో ఆప్కో వస్త్రాల కొనుగోలును పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రారంభించారు. ఇందుకోసం అమెజాన్‌తో ఆప్కో ఒప్పందం చేసుకుందన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై ఆప్కో, అమెజాన్ సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. అమెజాన్ సహాయంతో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతోందన్నారు. ఆప్కో నుంచి 104 రకాల చేనేత ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.