మావాళ్లకంటే అమ్మాయిలే నయం! | Some of them take more time than women to get dressed: Dhoni on Team India | Sakshi
Sakshi News home page

మావాళ్లకంటే అమ్మాయిలే నయం!

Published Wed, Dec 18 2013 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

మావాళ్లకంటే అమ్మాయిలే నయం!

మావాళ్లకంటే అమ్మాయిలే నయం!

జొహన్నెస్‌బర్గ్: ‘పార్టీకి సిద్ధమయ్యేందుకు అమ్మాయిలు ఎక్కువ సమయం తీసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ మా టీమ్‌లో కొందరు ఆటగాళ్లకంటే ఆడపిల్లలే నయం. మేకప్ కోసం వాళ్లు ఎంతో సమయం తీసుకుంటారు. కొందరు హెయిర్ జెల్ లేకుండా బయటికి రాకుంటే మరి కొందరేమో సన్‌స్క్రీన్, షవర్ జెల్ లేకుండా అడుగు పెట్టరు’...ఈ వ్యాఖ్య చేసిందెవరో కాదు భారత క్రికెట్ కెప్టెన్ ధోని.
 
 టీమిండియా సభ్యులకు భారత హైకమిషనర్ వీరేంద్ర గుప్తా ఇచ్చిన విందుకు జట్టు హాజరైన సందర్భంగా మహి ఈ మాటలు అన్నాడు. డిన్నర్ చేస్తూ కూడా ‘మేం భారతీయులమైనా తక్కువ తినే రకం కాదు. మాలో చాలా మందికి మూడు, నాలుగు సార్లు వడ్డించాల్సిందే’ అని అక్కడి సర్వర్‌లతో నవ్వుతూ అన్నాడు. టెస్టు మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి ఎలాంటి టెన్షన్ లేకుండా ధోని బృందం కొంత మంది భారత అభిమానులతో సరదాగా గడిపింది.
 
 మన ఉత్తమ బౌలర్ షమీ: గంగూలీ
 కోల్‌కతా: దక్షిణాఫ్రికాలో ఆడుతున్న భారత బౌలర్లలో షమీ అత్యుత్తమమని మాజీ కెప్టెన్ గంగూలీ ప్రశంసించాడు. ‘జహీర్, శ్రీశాంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు వారిని చూశాను. కానీ ప్రస్తుతం మాత్రం షమీ బాగా మెరుగ్గా కనిపిస్తున్నాడు’ అని  దాదా అన్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement