- ప్రతి రోజు 6 నుండి 8 లక్షల వ్యాపారం
- మత్స్య వ్యాపార కేంద్రంగా ఓడలరేవు
- వసతులు కల్పించాలని మత్స్యకారుల వినతి
వ్యాపారం ఘనం..వసతులు శూన్యం
Published Sun, Dec 11 2016 11:02 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
అల్లవరం :
అపార మత్స్య సంపదకు నిలయమైన ఓడలరేవులో నిత్యం వందలాది మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఆదాయం పరంగా ఎంతో వృద్ధి చెందినప్పటికీ వసతుల పరంగా అధ్వాన స్థితిలో ఉంది. పొరుగు జిల్లాల నుంచి వలస వచ్చే మత్స్యకార కుటుంబాలు ఎనిమిది నెలలు పాటు తీర ప్రాంతంలో నివాసాలు ఏర్పాటుచేసుకుని ఉపాధి పొందుతుంటారు.
కనీస సౌకర్యాలు కరువు
లక్షలాది రుపాయలు వ్యాపారం జరుగుతున్నా వేటాడిన మత్స్య సంపదను విక్రయించేందుకు కనీస సౌకర్యాలు ఇక్కడ కరువైయ్యాయి. తీరంలోకి వచ్చే వందలాది బోట్లకు ల్యాడింగ్ సౌకర్యం లేక నది మధ్యలో లంగరు వేసి మత్స్య సంపదను మర బోట్లు ద్వారా గట్టుకి చేరవేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల మత్స్యకారులకు అదనపు వ్యయం అవుతోంది.
ప్రకటనలకే పరిమితమైన జెట్టీ..
పదిహేనేళ్ల క్రితం ఓడలరేవు తీరంలో జెట్టీ నిర్మాణం అవసరమని అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఓడలరేవులో జెట్టీ నిర్మాణానికి రూ.3.9 కోట్లు మంజూరయ్యాయి. దీని నిర్మాణానికి స్థల సేకరణ ఆలస్యం కావడంతో కార్యరూపం దాల్చలేదు. నిర్మాణ వ్యయం పెరగడంతో ధవళేశ్వరం హెడ్‌వర్కు జెట్టీ నిర్మాణానికి రూ.5.04 కోట్లు అవసరమని అంచనాలు రుపొందించారు. ఇటీవల మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ జెట్టీ స్థలాన్ని పరిశీలించి త్వరలో పనులు చేపడుతామని హామీ ఇచ్చారు.
భారీ స్థాయిలో వ్యాపారం..
ఈ రేవులో నిత్యం వంద బోట్ల ద్వారా చేపలవేట సాగిస్తున్నారు. ప్రతి రోజు రూ. 6 నుండి 8 లక్షలు వరకూ విక్రయాలు జరుగుతూ కాకినాడ, విశాఖపట్నం నరసాపురం మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. విశాఖపట్నం జిల్లా నక్కపల్లికి చెందిన 30 బోట్లు, ఉప్పాడ నుండి 30 బోట్లు స్థానికంగా మరో 40 బోట్ల ద్వారా వైనతేయ నది ముఖద్వారం గుండా సముద్రంలోకి వేటకు వెళ్తాయి. తెల్లవారుజామున బయలుదేరి మధ్యాహ్నం వరకూ వేటాడిన చేపలను తీర ప్రాంతంలోకి తీసుకువచ్చి విక్రయిస్తారు. ఇలా విక్రయించిన చేపలకు రూ.6 నుండి 8 వేలు వరకు గిట్టుబాటు లభిస్తుంది. సోనాబోట్లు, మెకనైజ్డ్ బోట్లలో చేపల వేటకు వేళ్లే మత్స్యకారులు వారం రోజల పాటు చేపలను వేటాడి తిరిగివస్తూంటారు. వారం రోజల పాటు సముద్రంలో గడిపేందుకు ఒక్కొక్క సోనాబోటుకు రూ.1.5 లక్షలు ఖర్చు అవుతుంది. వారం పాటు వేటాడిన చేపలు విక్రయిస్తే ఖర్చులు పోను రూ.40 వేలు మిగులుతుంది. ఒక్కొక్క సారి చేపలు లభించక నష్టం కుడా వస్తుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేటాడిన చేపలను విక్రయించేందుకు సౌకర్యాలు లేక నేలపైన అమ్మకాలు జరపవలస్సి వస్తుందని మత్స్యకారులు వాపోతున్నారు. అలాగే వేటాడిన చేపలను విక్రయించడానికి కమీష¯ŒSపై స్థానికులే దళారులుగా వ్యవహరిస్తారన్నారు.
Advertisement