
కలకత్తా: అసెంబ్లీ ఎన్నికలు ముగియడం.. మరోసారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం చేయడంతోనే కరోనా వైరస్‌పై యుద్ధం ప్రకటించారు. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో కఠిన ఆంక్షలు విధిస్తూ సీఎం మమత బెనర్జీ నిర్ణయించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉంటుందని సీఎం తెలిపారు. మళ్లీ తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలకు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే రేపటి నుంచి స్థానిక రైళ్లు నిలిపివేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. 50శాతం సామర్థ్యంతోనే మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవాలని ఆదేశాలు ఇచ్చారు. 50 శాతం సామర్థ్యంతోనే ప్రభుత్వ కార్యాలయాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు పని చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టాలంటే కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. ఈ విధంగా ప్రమాణం చేసిన తొలిరోజు నుంచే కరోనాపై మమతా బెనర్జీ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎన్నికల ప్రభావంతో కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది.
చదవండి: పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు
Comments
Please login to add a commentAdd a comment