ఇండిగో భారీ ప్రమోషనల్ ఆఫర్ | IndiGo Announces Rs. 834 All-Inclusive Offer | Sakshi
Sakshi News home page

ఇండిగో భారీ ప్రమోషనల్ ఆఫర్

Published Thu, Oct 13 2016 1:56 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

ఇండిగో భారీ ప్రమోషనల్ ఆఫర్

ఇండిగో భారీ ప్రమోషనల్ ఆఫర్

ముంబై: విమాన యాన సంస్థ ఇండిగో ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా దేశీయ విమాన  ఛార్జీలను భారీగా తగ్గించింది.  అన్ని కలుపుకొని రూ.834  నుంచి ప్రారంభమయ్యే ధరలను అందిస్తోంది.  ఎంపిక చేసిన డొమెస్టిక్ రూట్లలో ఈ  తగ్గింపు ధరలను వర్తింప చేస్తున్నట్టు  గురువారం  ప్రకటించింది.  ఈ ఆఫర్ అక్టోబర్ 17వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇలా బుక్  చేసుకున్న టికెట్ల ద్వారా  అక్టోబర్ 30, 2016 నుంచి ఏప్రిల్ 13, 2017 ప్రయాణించాల్సి ఉంటుందని ఒక  ప్రకటనలో పేర్కొంది.  అయితే   ఈ ప్రమోషనల్ ఆఫర్ లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను మాత్రం ఇండిగో  వెల్లడి చేయలేదు.  అలాగే ఈ చార్జీలు నాన్  రిఫండబుల్ అని ఒక వేళ టికెట్లు క్యాన్సిల్  చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే చెల్లించబడతాయని స్పష్టం చేసింది.  దీంతోపాటుగా  ఈ పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ నెలలో  ప్రస్తుత నెట్ వర్క్ లో  47 కొత్త విమానాలను ప్రవేశపెడుతున్నట్టు ఇండిగో   ప్రకటించింది.
కాగా  ఇండిగో వెబ్ సైట్ లో చెక్ చేసినపుడు  ఢిల్లీ-జైపూర్ టిక్కెట్ ఈ ప్రచార ఆఫర్ కింద రూ.867 ప్రారంభ ధరగా  చూపిస్తోంది. ఢిల్లీ ముంబై టిక్కెట్ ధర  నవంబర్ మధ్యలో ప్రయాణానికి  రూ.2,030గా  ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement