ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలువురు విమానాల్లోనూ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానయాన సంస్థలు విమానయాన ఛార్జీలను అమాంతం పెంచేశాయి.
ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీల పెంపు పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. మహా కుంభమేళా వేళ ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న విమానయాన సంస్థలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. విమానయాన సంస్థలు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను కొనసాగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ నేపధ్యంలో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీలను 30 నుంచి 50 శాతం మేరకు తగ్గించింది.
మహా కుంభమేళా సమయంలో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు పలు విమానయాన సంస్థలతో సమన్వయ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో, విమానయాన సంస్థల ప్రతినిధులు, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి, దేశంలో వివిధ నగరాల నుంచి 132 విమానాలు ప్రయాగ్‌రాజ్‌కు సేవలు అందిస్తున్నాయి.
ఇండిగో తన వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 16 వరకు ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ విమానాలకు టిక్కెట్ ధరలు రూ.13,500 కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరి 31న ధరలు రూ.21,200 పైగా ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 12కి ధరలు తగ్గి రూ.9 వేలకు చేరనున్నాయని తెలిపింది. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవతో విమానయాన సంస్థలు టిక్కెట్ ఛార్జీలు తగ్గించనున్నట్లు ప్రకటించాయి.
ఇది కూడా చదవండి; Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి
Comments
Please login to add a commentAdd a comment