
క్యూ3లో రూ. 2,450 కోట్లు
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 2,450 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా కరెన్సీ ఆటుపోట్లు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,998 కోట్లు ఆర్జించింది.
అయితే ఇండిగో బ్రాండ్ విమాన సరీ్వసుల కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 20,062 కోట్ల నుంచి రూ. 22,993 కోట్లకు ఎగసింది. కాగా.. ఇంధన వ్యయాలు తగ్గడానికితోడు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో రూ. 3,850 కోట్ల లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 3.11 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసినట్లు వెల్లడించింది.
బీఎస్‌ఈలో ఇండిగో షేరు 0.6 శాతం బలపడి రూ. 4,163 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment