Profit Drops
-
బజాజ్ ఆటో రివర్స్‌గేర్.. చేతక్ అమ్మకాలు సూపర్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 1,385 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, డిఫర్డ్ ట్యాక్స్‌కు పెరిగిన కేటాయింపులు ప్రభావం చూపాయి. అయితే మొత్తం ఆదాయం రూ.10,838 కోట్ల నుంచి రూ. 13,247 కోట్లకు జంప్ చేసింది. మొత్తం వ్యయాలు రూ. 8,806 కోట్ల నుంచి రూ. 10,767 కోట్లకు పెరిగాయి. విక్రయాలు 16% అప్ ఈ క్యూ2లో బజాజ్ ఆటో స్టాండెలోన్ నికర లాభం 9 శాతం వృద్ధితో రూ. 2,005 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 10,777 కోట్ల నుంచి రూ. 13,127 కోట్లకు బలపడింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 16 శాతం ఎగసి 12,21,504 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 26 శాతం జంప్‌చేసి 6,36,801 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 5 శాతం పుంజుకుని 3,96,407 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 70,000 యూనిట్ల అమ్మకాలు సాధించింది. -
ఊహించినట్టుగానే జరిగింది.. భారీగా తగ్గిన విప్రో లాభాలు!
దేశంలో పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలలో తీవ్రంగా నిరాశపరిచింది. విశ్లేషకులు ఊహించినట్లుగానే లాభాల క్షీణత నమోదైంది. ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను విప్రో తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,065 కోట్లతో పోలిస్తే కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 2,700 కోట్లకు తగ్గిందని కంపెనీ నివేదించింది. అంటే దాదాపు 12 శాతం తగ్గింది. ఈ లాభాల క్షీణత విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉండటం గమనార్హం. క్యూ3 హైలైట్స్: గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.23,229 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఏకీకృత విక్రయాలు రూ.22,205 కోట్లుగా ఉన్నాయి. సేవల శాతం ప్రకారం ఆఫ్‌షోర్ ఆదాయం 59.8 శాతంగా ఉంది. డాలర్ ఆదాయం 2.66 బిలియన్ డాలర్లు ఆపరేటింగ్ మార్జిన్ వరుసగా 11 బేసిస్ పాయింట్లు తగ్గి 16 శాతంగా ఉంది. మొత్తం బుకింగ్‌లు 3.8 బిలియన్ డాలర్లు అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) 14.2 శాతంగా ఉంది. విప్రో ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. జనవరి 24ని అదే రికార్డు తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 10న లేదా అంతకు ముందే మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తామని తెలిపింది. కాగా వచ్చే త్రైమాసికం (క్యూ4)లో ఐటీ సేవల వ్యాపార విభాగం నుంచి 2,615 మిలియన్ డాలర్ల నుంచి 2,669 మిలియన్ డాలర్ల వరకు రాబడి ఉంటుందని విప్రో అంచనా వేస్తోంది. సిబ్బంది నియామకాలు, వ్యాపార కార్యకలాపాలలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే వెల్లడించారు. -
తగ్గిన భెల్ నికర లాభం, నష్టాల్లో షేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ కంపెనీ భెల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,564 కోట్ల నుంచి రూ.5,828 కోట్లకు చేరిందని భెల్ తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.64 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.322 కోట్లుగా ఉంది. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహరపచడంతో కంపెనీ షేరు ఏడాది కనిష్టానికి దిగివచ్చింది. కీలక సూచీలు లాభాలతో దూసుకుపోతుండగా మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత బీహెచ్ఈఎల్ కంపెనీ ఫలితాలను విడుదల చేసింది. దీంతో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ఏకంగా 7 శాతం కుప్పకూలింది. -
28 శాతం క్షీణించిన ఐసీఐసీఐ లాభం
సాక్షి, ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను మోదు చేసింది. క్యూ2లో బ్యాంక్ నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 655 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 909 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 26 శాతం ఎగసి రూ. 8057 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 3994 కోట్ల నుంచి రూ. 2507 కోట్లకు క్షీణించాయి. ఇతర ఆదాయం రూ. 3156 కోట్ల నుంచి రూ. 4194 కోట్లకు చేరింది. పన్ను వ్యయాలు రూ. 346 కోట్ల నుంచి రూ. 3712 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 13 శాతం రుణ వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 6.49 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.77 శాతం నుంచి 1.74 శాతానికి నీరసించాయి. స్థూల స్లిప్పేజెస్ రూ. 2779 కోట్ల నుంచి రూ. 2482 కోట్లకు వెనకడుగు వేశాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.61 శాతం నుంచి 3.64 శాతానికి మెరుగుపడ్డాయి. కాగా ఫలితాలపై అంచనాలతో శుక్రవారం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 469 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 471 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఫలితాల ప్రభావం దివాలీ మూరత్ ట్రేడింగ్‌లో కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
37 శాతం తగ్గిన హిందాల్కో లాభం
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్ నికర లాభం (స్టాండ్ అలోన్) గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.377 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.236 కోట్లకు తగ్గిందని హిందాల్కో తెలిపింది. ఆదాయం మాత్రం రూ.11,892 కోట్ల నుంచి రూ.12,733 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ సతీశ్ పాయ్ చెప్పారు. . ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం తగ్గిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.1.20 డివిడెండ్(120 శాతం)ను ఇవ్వనున్నామని తెలిపారు. వ్యాపార పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మంచి ఫలితాలు సాధించామని సతీష్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
నిరాశపర్చిన ఎస్బీఐ ఫలితాలు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా క్యూ4 లో విశ్లేషకుల అచనాలను అందుకోలేకపోయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆన్ ప్రొవిజన్లు భారీగా పుంజుకున్నాయి. నికర లాభం గణనీయంగా తగ్గి నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. అయితే అసెట్ నాణ్యత పరంగా బ్యాంకు మెరుగుపడింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల స్లిప్పేజెస్ రూ. 6541 కోట్ల నుంచి రూ. 7961 కోట్లకు ఎగశాయి. మార్చి31తో ముగిసిన 4వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఎస్బీఐ నికర లాభం రూ.838.4 కోట్లుగా నమోదైంది. గత క్వార్టర్లో రూ.3,955కోట్ల నికర లాభాలను ప్రకటించింది. 4,890 కోట్ల నికర లాభాలను ఆర్జింస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అయితే గత ఏడాది ఇదే క్వార్టర్లో 7,718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఆర్థిక ఫలితాల్లో నికర వడ్డీ ఆదాయం రూ.22,954 కోట్లుగా ఉంది. 3.95 శాతం నుంచి 3.05 శాతానికి తగ్గిన నికర ఎన్పీఏ లు రూ.65,895 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే ప్రొవిజన్లు రూ.16వేల కోట్లగాను, నిర్వహణ లాభం రూ.16,933 కోట్లగాను ఉంది. ఏవియేషన్ స్లిపేజెస్ 12,220 వేల కోట్ల రూపాయలు. ఫలితాలపై మేసేజ్‌మెంట్ వివరణతో ఎస్బీఐ బ్యాంకు కౌంటర్ పుంజుకుంది. స్వల్ప నష్టాలనుంచి తేరుకుని 3 శాతం లాభాల్లోకి మళ్లింది. -
పడిపోయిన టెక్ మహింద్రా
న్యూఢిల్లీ : ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహింద్రా లాభాల్లో పడిపోయింది. 2016 ఆర్థికసంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభాలు 19.2 శాతం కోల్పోయి, కేవలం రూ.643.4 కోట్ల నికరలాభాలను మాత్రమే ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.780.3 కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ రివ్యూ ఫలితాల్లో ఆపరేషన్స్ నుంచి వచ్చిన మొత్తం ఆదాయాలు ఎనిమిది శాతం ఎగిసి రూ.7,167.4 కోట్లగా నమోదైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఆర్థిక త్రైమాసికంలో తమ పనితీరు, కొత్త టెక్నాలజీల్లో తాము పెట్టిన పెట్టుబడుల, సామర్థ్యాల ఫలితమేనని టెక్ మహింద్రా వైస్ చైర్మన్ వినీత్ నాయర్ తెలిపారు. డాలర్ విలువలో ఆర్జించే పీఏటీలు(పన్నుల అనంతర లాభాలు) యేటికేటికీ 18.2 శాతం పడిపోయి, 96.5 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ తమకు మంచి త్రైమాసికమేనని, కీలకమైన కమ్యూనికేషన్, ఎంటర్ప్రైజ్ బిజినెస్‌లు వృద్ధిని నమోదుచేయడానికి దోహదం చేశాయని కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు.