న్యూఢిల్లీ: బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 1,385 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, డిఫర్డ్ ట్యాక్స్‌కు పెరిగిన కేటాయింపులు ప్రభావం చూపాయి. అయితే మొత్తం ఆదాయం రూ.10,838 కోట్ల నుంచి రూ. 13,247 కోట్లకు జంప్ చేసింది. మొత్తం వ్యయాలు రూ. 8,806 కోట్ల నుంచి రూ. 10,767 కోట్లకు పెరిగాయి.
విక్రయాలు 16% అప్
ఈ క్యూ2లో బజాజ్ ఆటో స్టాండెలోన్ నికర లాభం 9 శాతం వృద్ధితో రూ. 2,005 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 10,777 కోట్ల నుంచి రూ. 13,127 కోట్లకు బలపడింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 16 శాతం ఎగసి 12,21,504 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 26 శాతం జంప్‌చేసి 6,36,801 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 5 శాతం పుంజుకుని 3,96,407 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 70,000 యూనిట్ల అమ్మకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment