న్యూఢిల్లీ: ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ నష్టాలు స్వల్పంగా తగ్గాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 626 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2023–24) ఇదేకాలంలో రూ. 657 కోట్ల నష్టం ప్రకటించింది.
మొత్తం ఆదాయం రూ. 2,763 కోట్ల నుంచి రూ. 3,601 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,507 కోట్ల నుంచి రూ. 4,310 కోట్లకు పెరిగాయి. కంపెనీ ఇటీవలే స్టాక్ ఎక్చ్సేంజీలలో లిస్ట్‌కావడంతో తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.
కాగా.. సొంత అనుబంధ సంస్థ స్కూట్సీ లాజిస్టిక్స్ ప్రయివేట్‌లో రైట్స్ ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 1,600 కోట్లకు మించకుండా ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు స్విగ్గీ వెల్లడించింది. స్కూట్సీ ప్రస్తుతం సప్లైచైన్ సర్వీసులు, పంపిణీ బిజినెస్ నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment