సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా క్యూ4 లో విశ్లేషకుల అచనాలను అందుకోలేకపోయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆన్ ప్రొవిజన్లు భారీగా పుంజుకున్నాయి. నికర లాభం గణనీయంగా తగ్గి నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. అయితే అసెట్ నాణ్యత పరంగా బ్యాంకు మెరుగుపడింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల స్లిప్పేజెస్ రూ. 6541 కోట్ల నుంచి రూ. 7961 కోట్లకు ఎగశాయి.
మార్చి31తో ముగిసిన 4వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఎస్‌బీఐ నికర లాభం రూ.838.4 కోట్లుగా నమోదైంది. గత క్వార్టర్‌లో రూ.3,955కోట్ల నికర లాభాలను ప్రకటించింది. 4,890 కోట్ల నికర లాభాలను ఆర్జింస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అయితే గత ఏడాది ఇదే క్వార్టర్‌లో 7,718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
బ్యాంకు ఆర్థిక ఫలితాల్లో నికర వడ్డీ ఆదాయం రూ.22,954 కోట్లుగా ఉంది. 3.95 శాతం నుంచి 3.05 శాతానికి తగ్గిన నికర ఎన్‌పీఏ లు రూ.65,895 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే ప్రొవిజన్లు రూ.16వేల కోట్లగాను, నిర్వహణ లాభం రూ.16,933 కోట్లగాను ఉంది. ఏవియేషన్ స్లిపేజెస్ 12,220 వేల కోట్ల రూపాయలు.
ఫలితాలపై మేసేజ్‌మెంట్ వివరణతో ఎస్‌బీఐ బ్యాంకు కౌంటర్ పుంజుకుంది. స్వల్ప నష్టాలనుంచి తేరుకుని 3 శాతం లాభాల్లోకి మళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment