పడిపోయిన టెక్ మహింద్రా
పడిపోయిన టెక్ మహింద్రా
Published Thu, Oct 27 2016 8:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
న్యూఢిల్లీ : ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహింద్రా లాభాల్లో పడిపోయింది. 2016 ఆర్థికసంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభాలు 19.2 శాతం కోల్పోయి, కేవలం రూ.643.4 కోట్ల నికరలాభాలను మాత్రమే ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.780.3 కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ రివ్యూ ఫలితాల్లో ఆపరేషన్స్ నుంచి వచ్చిన మొత్తం ఆదాయాలు ఎనిమిది శాతం ఎగిసి రూ.7,167.4 కోట్లగా నమోదైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది.
ఈ ఆర్థిక త్రైమాసికంలో తమ పనితీరు, కొత్త టెక్నాలజీల్లో తాము పెట్టిన పెట్టుబడుల, సామర్థ్యాల ఫలితమేనని టెక్ మహింద్రా వైస్ చైర్మన్ వినీత్ నాయర్ తెలిపారు. డాలర్ విలువలో ఆర్జించే పీఏటీలు(పన్నుల అనంతర లాభాలు) యేటికేటికీ 18.2 శాతం పడిపోయి, 96.5 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ తమకు మంచి త్రైమాసికమేనని, కీలకమైన కమ్యూనికేషన్, ఎంటర్ప్రైజ్ బిజినెస్లు వృద్ధిని నమోదుచేయడానికి దోహదం చేశాయని కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు.
Advertisement