
సాక్షి, హైదరాబాద్ : ఫిట్నెస్ మంత్రాతో అభిమానులను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మరోసారి తన యోగాసనంతో ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇటీవల సోషల్ మీడియాలో యోగా ప్రాక్టీస్ ఫోటోలను షేర్ చేస్తున్నసమంత తాజాగా భర్త నాగ చైతన్య తో కలిసి వేసిన ఆసనాల ఫోటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. (కొత్త ప్రయాణం)
తోటపనితో పాటు, యోగాను కూడా ఇష్టపడతానని చెప్పిన సమంత, భర్తతో కలిసి చేయడం ఇంకా ఎంజాయ్ చేస్తానన్నారు. తొలిసారి శీర్షాసనం కోసం ప్రయత్నించి విజయం సాధించామంటూ శీర్షాసనం ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలి పోర్ట్రయిట్ ఫోటో అంటూ పెంపుడు కుక్క ఫోటోను కూడా ఉంచడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరలవుతున్నాయి.
సమంతా, నాగచైతన్య జంట యోగాలో ప్రొఫెషనల్ శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చేసిన యోగా ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సూపర్ బెస్ట్ ట్రైనర్ అంటూ సంతోష్ గురించి కూడా సమంత ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment