
Naga Chaitanya Quotes About Green Lights For Life Goes Viral: సమంత-నాగచైతన్య విడాకుల అనంతరం ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ మరింత పెరిగింది. సాధారణంగానే సమంతతో పోలిస్తే నాగ చైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. తన సినిమాలు, బైకులు, కార్ల గురించి తప్పా సోషల్ మీడియాలో వేరే పోస్టులు షేర్ చేయడు. తాజాగా చైతూ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
పాపులర్ రైటర్ మాథ్యూ రాసిన 'గ్రీన్ లైట్స్' అనే పుస్తకాన్ని షేర్ చేసిన చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. 'లవ్ లెటర్స్ టూ లైఫ్..మీ జర్నీని షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాథ్యూ.. ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్ లైట్(జీవితంలో ముందుకు వెళ్లడం, క్యారీఆన్ అనే అర్థం) అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఎప్పుడూ ప్రేమ, జీవితం లాంటి వాటిపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని చైతూ..బ్రేకప్ తర్వాత ఇన్‌స్టాలో తొలిసారి చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సామ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన చై ప్రస్తుతం ఆ ఙ్ఞాపకాల్లోంచి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. మరోవైపు సామ్ సైతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్, హాలీవుడ్‌లో సైతం ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment