Samantha Visit Sadhguru Meditation Centre At Coimbatore, Pics Viral - Sakshi
Sakshi News home page

Samantha: సామాన్యురాలిగా మారిన సామ్.. మరి ఇంత సింపుల్‌గానా!

Published Wed, Jul 19 2023 6:19 PM | Last Updated on Wed, Jul 19 2023 6:48 PM

Samantha Visit Sadhguru Meditation Centre At Coimbatore - Sakshi

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు చెప్పిన సామ్.. త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో చికిత్స కూడా తీసుకుంది. కోలుకున్న తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ, వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చేసింది. త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం.

(ఇది చదవండి: జులై 13 నాకు చాలా స్పెషల్‌ : సమంత)

అయితే అంతకుముందే ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు సామ్. ఇటీవలే తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్‌ దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఖుషీ భామ. అయితే వైద్యం కోసం విదేశాలకు వెళ్లేముందు మనోధైర్యం కోసమే ఆలయాలకు వెళ్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే తాజాగా సమంత మరోసారి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయింది. ప్రముఖ  యోగా గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు నిర్వహించిన ఆధ్యాత్మిక యెగా కార్యక్రమానికి సమంత హాజరయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన యోగా శిబిరంలో సామ్ ఓ సామాన్య భక్తురాలిగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఎలాంటి ఆలోచనలు, కదలికలు, మెలికలు తిరగకుండా నిశ్చలంగా కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపించింది. కానీ ఈరోజు ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మూలమని తెలిసింది. ఇంత సింపుల్‌గా ఉండే ధ్యానం.. ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఎవరు అనుకోరు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. ఇటీవలే ఖుషీ షూటింగ్ పూర్తి చేసుకున్న భామ త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు బయలుదేరనుంది. 

(ఇది చదవండి: వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement