Samantha Shares a Photo with Her Pets As, Sasha in Instagram - Sakshi
Sakshi News home page

Samantha: ‘బాధపడకమ్మా.. నేను నీ వెనకే ఉన్నా’: సమంత ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sat, Jan 14 2023 7:06 PM | Last Updated on Sat, Jan 14 2023 8:19 PM

Samantha Shares a Photo With Her Pets As, Sasha in Instagram - Sakshi

చాలా రోజుల సమంత ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్నా ఆమె తన లేటెస్ట్‌ మూవీ శాకుంతలం ట్రైలర్‌ ఈవెంట్‌లో మెరిసింది. కాగా ఈ వ్యాధి కారణంగా కొద్ది రోజులుగా ఆమె ఇంటికే పరిమితమమైంది. మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్న సమంత మీడియాకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంది. ఇక ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో మళ్లీ ఆమె యాక్టివ్‌ అయ్యింది.

చదవండి: అఫిషియల్‌: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్‌’ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

గత వారం రోజులుగా ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్స్‌ షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌ సామ్‌ అభిమానులను కదిలిస్తోంది. స్టార్‌ హీరో నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత తన పెంపుడు కుక్కుల హాష్‌, సాషాలతో ఒంటరిగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. సమంత సోఫాలో పడుకుని ఉండగా ఆమె పక్కనే హాష్‌, సాషాలు ఉన్నాయి. సామ్‌ బోర్లా పడుకుని ఉండగా హాష్‌ ఆమె నడుంపై కాలు పెట్టి ఉంది.

చదవండి: దుమ్ములేపుతున్న వాల్తేరు వీరయ్య.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే!

ఈ ఫొటోను సమంత షేర్‌ చేస్తూ.. ‘బాధపడకు అమ్మా.. నేను నీ వెనుకే ఉన్నా’ అంటూ (హ్యాష్‌ తనతో చెబుతున్నట్లు) రాసుకొచ్చింది సామ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ ఆమె ఫాలోవర్స్‌ను ఎమోషనల్‌కు గురి చేస్తుంది. కొందరు క్యూట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తుండగా.. మరికొందరు ధైరంగా ఉండు సామ్‌ అంటూ ఆమెను ఓదార్పు ఇస్తున్నారు. ఆమె ఫ్యాన్స్‌ అయితే ఈ కఠిన సమయంలో తనవెంట ఎవరూ లేరంటూ వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement