ChaySam Divorce: Samantha Gets Emotional On Social Media And Shares Instagram Story - Sakshi
Sakshi News home page

Samantha: చివరికి వారి పతనం తప్పదు: ఇన్‌స్టా స్టోరీ వైరల్‌

Published Sat, Oct 2 2021 6:44 PM | Last Updated on Sun, Oct 3 2021 10:29 AM

Samantha Gets Emotional On Social Media And Shares Instagram Story  - Sakshi

టాలీవుడ్‌ జంట సమంత-నాగ చైతన్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. తాము విడిపోతున్నామంటూ చై-సామ్‌లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. దీంతో కొంతకాలంగా వీరి విడాకులపై వస్తున్న ఊహగానాలకు తెరపడింది. ఈ నేపథ్యంలో సమంత సోషల్‌ మీడియాలో భావోద్యేగానికి లోనయ్యింది. విడాకుల ప్రకటనకు ముందే సమంత ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఈ పోస్టులో ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళ ఫొటోను షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయ్యింది. 

చదవండి: చైతు-సమంత విడాకులపై నాగార్జున స్పందన

ఇందులో సామ్‌ ‘నేను బాధలో, విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. చరిత్రలో చివరకు ప్రేమే గెలుస్తుందనేది నిజం. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల, నియంతలు ఉంటారు.. వెన్నుపోటు పొడుస్తారు. ఏది కనబడకుండా కుట్ర చేయడంలో వాళ్లు నిపుణులు. కానీ చివరకు వారి పతనం తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం’ అంటూ స్టోరీని ముగించింది. ఇది చూసిన సామ్‌ అభిమానులంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సమంత అయిష్టంగానే విడాకులు తీసుకుంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌ ఆమె ఎవరిని ఉద్దేశిస్తూ చేసిందనేది మాత్రం స్పష్టం లేదు. అయితే విడాకుల ప్రకటన అనంతరం సమంత పోస్ట్‌ వార్తల్లో నిలుస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలు చర్చించుకుంటున్నారు. 

చై-సామ్‌ పెళ్లినాటి  ఫోటోలు

చదవండి: #Chaysamdivorce: గుండె పగిలింది.. నాలుగేళ్లకే ఎందుకు ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement