Samantha Akkineni Enjoy With Hash, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో షేర్‌ చేసిన సామ్‌..మంచు లక్ష్మీ, రష్మిక రియాక్షన్‌ ఇదే..

Jul 15 2021 9:10 AM | Updated on Jul 15 2021 12:32 PM

Samantha Akkineni Enjoys A Playdate With Pet Dog Hash Video Viral - Sakshi

హీరోయిన్‌ సమంతకు హష్‌ అనే కుక్కపిల్ల ఉన్న సంగతి తెలిసిందే. పేరుకు పెట్‌ డాగ్‌ అయినా సమంత మాత్రం దాన్ని సొంత బిడ్డలాగే చూసుకుంటుంది. హష్‌ను విడిచి ఉండలేక కొన్నిసార్లు షూటింగ్‌ లొకేషన్లకు కూడా తీసుకెళ్తుంటుంది. ఇక షూటింగ్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన పెట్‌తోనే ఎక్కువ సమయం గడుపుతుంది సమంత.  తాజాగా హష్‌తో కలిసి తన గార్డెన్‌లో సరదాగా ఆడుకుంటున్న వీడియోను సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.ఇందులో సమంతతో పోటీ పడుతూ హష్‌ బెలూన్‌ గేమ్‌లో మునిగిపోవడం కనిపిస్తుంది. హష్‌కు బెలూన్‌తో ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టమని తన పోస్టులో రొసుకొచ్చింది. 

ఇక సామ్‌ పోస్ట్‌పై మంచు లక్ష్మీ, రష్మిక, ప్రగ్యా జైస్వాల్‌ సహా పలువురు సెలబ్రిటీలు స్పందించారు. సమంత షేర్‌చేసిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమంతకు హష్‌ మీదున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాట్‌ ఎ క్యూట్‌ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత శాకుంతలం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత శకుంతలగా, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement