గతేడాది యానిమల్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో నేషనల్ క్రష్ రష్మిక. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ జోడీగా కనిపించనుంది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పుష్పలో శ్రీవల్లిగా సినీ ప్రియులను అలరించింది. దీంతో పుష్ప-2 చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా.. రష్మిక తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్ డాగ్స్, క్యాట్స్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. మీతో సమయం వెచ్చించడం నాకు చాలా ఉత్సాహంగా ఉంటుందని రాసుకొచ్చింది. మీతో ఉన్న అద్భుతమైన క్షణాలను పంచుకోకుండా ఉండలేకపోతున్నా అంటూ పోస్ట్ చేసింది.
అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక దిగిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ పెట్ డాగ్ కూడా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఫ్యాన్స్ శ్రీవల్లి బ్యూటిఫుల్ పిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక షేర్ చేసిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ పెట్‌డాగ్ కూడా కనిపించడంతో ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలో రష్మిక చాలాసార్లు విజయ్ ఫ్యామిలీతో కనిపించింది. దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు రూమర్స్ కూడా వచ్చాయి.
Anytime I find a fur ball around me.. it feels like a universal compulsion for me to spend a good amount of time with them.. and I was going through my gallery from since forever and these are some lovely moments I haven’t been able to share with you.. ❤ so here.
But on the… pic.twitter.com/ETEWkTNxpB— Rashmika Mandanna (@iamRashmika) May 24, 2024
Comments
Please login to add a commentAdd a comment