![Rashmika Mandanna: I am Very Possessive Mama To Samantha - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/4/saam-rashmika.gif.webp?itok=YUOOecz0)
హీరోయిన్ సమంత మయోసైటిస్ బారిన పడిందన్న విషయం తెలిసి చాలామంది షాక్‌కు గురయ్యారు. సమంతతో ఇన్నిరోజులుగా జర్నీ చూస్తున్న మాకు కూడా ఈ విషయం తెలియదని పలువురు సన్నిహితులు సైతం వాపోయారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సైతం సమంత తన వ్యాధి గురించి సోషల్ మీడియాలో చెప్పేవరకు తనకూ తెలియదని పేర్కొంది.
తాజాగా వారిసు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. 'సమంత వండర్‌ఫుల్ లేడీ. చాలా మంచిది. ఆమె విషయంలో ఒక అమ్మలా నేను తనకు రక్షణ కల్పించాలనుకుంటాను. సమంత తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించేవరకు నాకూ ఏమీ తెలియదు. మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ఏనాడూ చెప్పలేదు. ఏదేమైనా ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సమంత నుంచి అందరిలాగే నేను కూడా స్ఫూర్తి పొందుతాను' అని చెప్పుకొచ్చింది. కాగా రష్మిక హీరోయిన్‌గా నటించిన పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా అనే ఐటం సాంగ్‌లో ఆడిపాడింది.
చదవండి: వీడియోతో ట్రోలర్స్ నూరు మూయించిన హీరోయిన్
చిన్న కూతురు శ్రీజకు చిరంజీవి ఖరీదైన కానుక
Comments
Please login to add a commentAdd a comment