Naga Chaitanya And Samantha Love Breakup Story In Telugu: గత రెండు నెలల కాలంగా చైసామ్‌ల విడాకుల అంశమే చర్చనీయాంశంగా నిలిచిందంటే అతి శయోక్తి కాదు. వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ నాగచైతన్య, సమంత ముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ మోస్ట్ లవబుల్ పదేళ్ల బంధానికి ఈ ఏడాది అక్టోబర్‌లో ఎండ్‌కార్డ్ పడింది. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు. అయినా వీరి బ్రేకప్ తరువాత నవంబరు 23న చై తొలి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ మరోసారి తమ అభిమాన జంట గురించి చర్చించు కుంటున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు.
చై-సామ్‌ల జీవితంలో ‘ఏమాయ చేసావే’ మూవీ పెద్ద మాయ చేసింది. ఇద్దరి సినీ జీవితాలను కీలక మలుపు తిప్పిన సినిమా ఇది. 2010 ఫిబ్రవరి, 26న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్‌కు సమంత పరిచయం కాగా, చైతుకి విజయాన్ని అందించిన తొలి మూవీ.ఏఆర్ రెహ్మాన్ సంగీతం మరో హైలైట్. ముఖ్యంగా ‘కుందనపు బొమ్మ’గా సామ్‌ను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చై-సామ్‌లకే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో కూడా మరుపురాని ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయింది. అలా మొదలైన వీరి ప్రయాణం ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలతో మరింత బలపడింది. పెళ్లైన తర్వాత మజిలీ ద్వారా మరో భారీ హిట్ అందుకున్నారు. అంతలోనే ఈ ఆనందం ముచ్చటగానే మిగిలిపోయింది.
ముఖ్యంగా ఫ్యామిలీ స్టోరీగా, సమంత, చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మనం’ భారీ విజయాన్ని అందుకుంది. చై-సామ్ కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచి పోయింది. భార్యాభర్తలుగా చైతు, సమంతా జీవించారు. ఈ మూవీ టైంలో నే వీరి మధ్య బంధంబలపడిందని, వీళ్ల లవ్ ట్రాక్ ఆ తరువాతే తనకు తెలిసిందని ఒక సందర్భంలో నాగ్ స్వయంగా చెప్పారు.
నాగచైతన్య, సమంతల కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ‘ఆటోనగర్ సూర్య’. ఇది పెద్దగా విజయంగా సాధించకపోయినా, నటనాపరంగా ఇద్దరూ ఆకట్టు కున్నారు. చైసామ్‌ల వివాహనంతరం వచ్చిన తొలి చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రశంస లందుకుంది. ఇందులో క్రికెటర్‌గా ఎదగాలనుకునే పూర్ణ అనే యువకుడిగా నాగచైతన్య, భర్తను దారికి తెచ్చకున్న శ్రావణిగా సమంత ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఈ సినిమా హిట్ మూవీగా నిలవడమేకాదు, పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది.
ఇక నందినీరెడ్డి దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ‘ఓ బేబీ’. సామ్ కెరీర్‌లో మరో మైలు రాయి లాంటిది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీలో 70 ఏళ్ల వృద్ధురాలు బేబీగా సమంత నటన మరో మెట్టును అధిగమించింది. ఇందులో నాగచైతన్య అతిథిపాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
వెండితెరపై ప్రేమికులుగా, దంపతులుగా, స్నేహితులుగా మొత్తం ఐదు సినిమాల్లో చై-సామ్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. నిజజీవితంలోనూ చూడ ముచ్చటైన జంటగా ప్రశంసలు పొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను కలచి వేసింది. ముఖ్యంగా రీల్ లవ్‌స్టోరీతో భారీ విజయాన్ని అందుకున్న తమ అభిమాన హీరో నాగ చైతన్య రియల్ లవ్‌స్టోరీ బ్రేకప్‌ను ప్రకటించడం ఇప్పటికీ శరాఘాతమే.
Comments
Please login to add a commentAdd a comment