యశోద సినిమా నుంచి అప్‌డేట్‌.. గ్లింప్స్‌కి ముహూర్తం రెడీ | Samantha First Glimpse From Yashoda Movie Release Date Fix | Sakshi
Sakshi News home page

Samantha: యశోద సినిమా నుంచి అప్‌డేట్‌.. గ్లింప్స్‌కి ముహూర్తం రెడీ

Published Thu, Apr 28 2022 8:31 PM | Last Updated on Thu, Apr 28 2022 8:37 PM

Samantha First Glimpse From Yashoda Movie Release Date Fix - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇటీవలె ఆమె నటించిన యశోద సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఆగస్టు12న ఈ సినిమా విడుదల కానుంది. గురువారం(ఏప్రిల్‌28)న సమంత బర్త్‌డే సందర్భంగా యశోద సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రం​ ఫస్ట్‌ గ్లింప్స్‌ను మే5న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరి, హరీష్‌లు దర్శకత్వం వహించగా,  శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

చదవండి: సమంతపై ప్రాంక్‌.. విజయ్‌ సర్‌ప్రైజ్‌ మామూలుగా లేదుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement