Actor Sai Dharam Tej Special Birthday Wishes To Samantha At Mid Night, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha Birthday: సమంతకు ఆ హీరో నుంచి స్పెషల్‌ విషెస్‌, ట్వీట్‌ వైరల్‌

Apr 28 2022 3:32 PM | Updated on Apr 28 2022 4:28 PM

Hero Sai Dharam Tej Mid Night Wishes To Samantha - Sakshi

Happy Birthday Samantha: స్టార్‌ హీరోయిన్‌ సమంత బర్త్‌డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి ఆమెకు బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఓ హీరో మాత్రం ప్రత్యేకంగా సామ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా అందరికంటే ముందుగా విషెస్‌ చెప్పిన ఫస్ట్‌ సెలబ్రిటీగా నిలిచాడు. అతను మరెవరో కాదు.. సమంత తన ఫేవరేట్‌ హీరోయిన్‌ అని ఎన్నోసార్లు చెప్పిన మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌.

కరెక్ట్‌గా అర్థరాత్రి 12 గంటలకు తేజ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా సామ్‌కు విషెస్‌ చెప్పాడు. 'జెస్సీ, నువ్వు ఏం మాయ చేశావో కానీ.. ఎటో వెళ్లిపోయింది మనసు.వెరీ హ్యాపీ బర్త్ డే సామ్‌.  ఇట్లు నీ వీరాభిమాని..' అంటూ ట్వీట్‌ చేశాడు. దీనికి సమంత బ్యూటిఫుల్‌ వైట్‌ అండ్‌ బ్లాక్‌ ఫోటోను కూడా జతచేశాడు.

ప్రస్తుతం తేజ్‌ చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక తేజ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సమంతకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. 2010లో ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement