Ram Charan posts a heartfelt birthday note for his Rangasthalam co-star Samantha on her birthday - Sakshi
Sakshi News home page

Ram Charan-Samantha: రామలక్ష్మికి చిట్టిబాబు స్పెషల్‌ విషెస్‌.. ట్వీట్‌ వైరల్‌

Apr 28 2023 7:04 PM | Updated on Apr 28 2023 7:28 PM

Ram Charan Wishes Rangasthalam Co Star Samantha On Her Birthday - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సమంత తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది. జెస్సీ పాత్రలో ఆడియెన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది.

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ లిస్ట్‌లో చేరిపోయి ఇప్పటికీ అదే హవాను కొనసాగిస్తోంది. ఇవాళ(శుక్రవారం)సమంత 36వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సమంతకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. డియర్‌ సమంత.. నిన్ను, నీ పని పట్ల ఎంతో గర్వపడుతుంటాను. నీకు మంచి ఆరోగ్యం, సక్సెస్‌ దక్కాలని కోరుకుంటున్నా అంటూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశాడు. వీరిద్దరూ తొలిసారి రంగస్థలం సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement