Samantha Pens Emotional Thanks Note for Fans About Her Birthday Wishes - Sakshi
Sakshi News home page

Samantha : ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొంటా.. సమంత ఎమోషనల్‌

Published Fri, Apr 29 2022 6:27 PM | Last Updated on Fri, Apr 29 2022 8:08 PM

Samantha Pens Emotional Post For Her Fans About Birthday Wishes - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత కెరీర్‌లో స్పీడు పెంచారు. తెలుగు, తమిళం సహా హిందీలో వరుస సినిమాలను లైన్‌లో పెడుతుంది. ఇదిలా ఉండగా ఏప్రిల్‌28న సమంత నటించిన కాతు వక్కుల రెండు కాదల్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదేరోజు సమంత పుట్టినరోజు కావడం మరింత విశేషంగా మారింది. గురువారం సామ్‌ 35వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అభిమానులు సహా పలువురు ప్రముఖులు ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ సమంత పోస్ట్‌ చేసింది. ‘‘నా పుట్టినరోజు నాడు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ అందరి  ప్రోత్సహం, స్ఫూర్తి, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరంతా నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు’’ అంటూ సామ్‌ భావోద్వేగ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement