Megastar Chiranjeevi Tweet About Samantha Myositis - Sakshi
Sakshi News home page

Chiranjeevi : 'డియర్‌ సామ్‌.. నువ్వు త్వరగా కోలుకోవాలి' అంటూ చిరు ట్వీట్‌

Published Sun, Oct 30 2022 1:24 PM | Last Updated on Sun, Oct 30 2022 2:32 PM

Megastar Chiranjeevi Tweet About Samantha Myositis - Sakshi

సమంత అనారోగ్య పరిస్థితిపై చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని సమంత పోస్ట్‌ చేయడంతో ఇండస్ట్రీ సహా ఆమె అభిమానులు షాక్‌ అయ్యారు. ఎప్పుడూ చలాకీగా, యాక్టివ్‌గా కనిపించే సమంతకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. చదవండి: 'మయోసైటిస్‌' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా?

ఇప్పటికే  అక్కినేని అఖిల్ , ఎన్టీఆర్, నాని, సుశాంత్, కృతిసనన్, రాశికన్నా, హన్సిక, జెనీలియా సహా పలువురు సెలబ్రిటీలు సైతం సమంత ఆరోగ్యంపై స్పందిస్తూ నువ్వు స్ట్రాంగ్‌, ఈ పరిస్థితుల నుంచి బయటపడతావ్‌ అంటూ ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సమంత అనారోగ్యంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. సమంత త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.

'కాలనుగుణంగా మన జీవితంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోవడానికి ఆ సవాళ్లు ఎదురవుతాయి. సమంత ఒక అద్భుతమైన అమ్మాయి. అంతర్గతంగా ఎంతో ధైర్యంగా ఉంటుంది. అతి  త్వరలోనే ఆమె అనారోగ్య సమస్య నుంచి బయపడుతుందని అనుకుంటున్నాను.సమంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ చిరు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. చదవండి: సమంత 'మయోసైటిస్‌' వ్యాధిపై అఖిల్‌ అక్కినేని కామెంట్స్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement