హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకే తమిళమ్మాయి గానీ టాలీవుడ్‌లో వరస సినిమాలు చేసింది. అలానే హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలైపోయింది. అయితే వ్యక్తిగత కారణాలతో 2021లో సమంత-చైతూ విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన ఏడాది సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు సామ్ బయటపెట్టింది. ఇప్పుడు దాన్నుంచి కోలుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
'ఏ మాయ చేశావె' సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న సమంత.. ఆ తర్వాత తెలుగులో మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. చివరగా 'ఖుషి' చేసింది. ప్రస్తుతం ఈమె చేతలో కొత్త ప్రాజెక్టులేం లేవు. దీంతో యూట్యూబ్ ఛానెల్‌లో పాడ్ కాస్ట్ మొదలుపెట్టింది. తాజాగా తొలి ఎపిసోడ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులోనే ఆటో ఇమ్యూనిటీ గురించి మాట్లాడింది.
(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి)
సమంతతో పాటు ఈ పాడ్ కాస్ట్‌లో ప్రత్యేక నిపుణుడు అల్కేశ్‌తో కనిపించింది. అతడు ఆటో ఇమ్యూనిటీ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. 'శరీరంలోని చెడు కారకాలు.. బయటికి వెళ్లే చెడు కారకాల మధ్య బ్యాలెన్స్(సమ తుల్యత) దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుత జీవన విధానంలో పర్యావరణానికి సంబంధించిన టాక్సిక్స్ (చెడు కారకాలు) ఎక్కువగా ఉన్నాయి. కాస్మోటిక్స్, దుస్తులు, వంట సమాన్లతో పాటు చాలా విషయాలు.. ఆటో ఇమ్యూనిటీ విషయంలో ప్రభావం చూపిస్తాయి' అని ఇతడు చెప్పుకొచ్చాడు.
దీనిపై స్పందించిన సమంత.. 'చాలామంది మంచి ఆహారం తింటూ బాగున్నామని, ఎలాంటి సమస్యలు రావని అనుకుంటున్నారు. నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఆటో ఇమ్యూనిటీ సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. తద్వారా మయోసైటిస్ బారిన పడ్డాను. అయితే వ్యాధి రావడానికి ముందు ఏడాది అయితే నాకు చాలా కష్టంగా గడిచింది' అని సమంత చెప్పుకొచ్చింది. ఈ వీడియో బట్టి సమంతకు సౌందర్య సాధనాలు (కాస్మోటిక్స్) వల్లే మయోసైటిస్ సమస్య ఏర్పడిందా అనే సందేహం కలుగుతోంది.
(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!)
Comments
Please login to add a commentAdd a comment