
సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించే సామ్ ఇలా అనారోగ్యం బారిన పడటం, కోలుకోవడానికి తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుందంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేయడంతో సినీ తారలు సహా నెటిజన్లు షాక్‌కి గురయ్యారు. చదవండి: వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్
సమంత అనారోగ్యంపై అక్కినేని అఖిల్ , ఎన్టీఆర్, నాని, సుశాంత్, కృతిసనన్, రాశికన్నా, హన్సిక, జెనీలియా, నందినిరెడ్డి, వంశీపైడిపల్లి సహా పలువురు ప్రముఖులు స్పందించారు.ఆమెకు ధైర్యం చెబుతూ గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. మరోవైపు సమంత అనారోగ్యంపై నాగచైతన్య స్పందిస్తాడా? లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భార్యభర్తలుగా విడిపోయినప్పటికీ ఫ్రెండ్‌లా అయినా చై సామ్ గురించి పోస్ట్ చేస్తే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2018లో పెళ్లి చేసుకున్న చై-సామ్‌లు గతేడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: 'మయోసైటిస్' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా?
Comments
Please login to add a commentAdd a comment