ఏడాది నుంచి దానికి దూరమైన సమంత.. ఎంత కష్టమో! | Actress Samantha Eat Bread After One Year | Sakshi
Sakshi News home page

Samantha: సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఏడాది తర్వాత ఇప్పుడే!

Published Mon, Oct 16 2023 6:33 PM | Last Updated on Mon, Oct 16 2023 6:51 PM

 Actress Samantha Eat Bread After One Year - Sakshi

హీరోయిన్ సమంత ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. నాగచైతన్యతో మళ్లీ కలుస్తుందని తెగ రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై నేరుగా స్పందించకుండా అతడి గుర్తుగా ఉన్న టాటూ చెరిపేశా అన్నట్లు ఓ ఫొటో పోస్ట్ చేసిన సామ్.. పుకార్లకు చెక్ పెట్టింది. ఇలా గత కొన్నాళ్ల నుంచి ట్రెండ్ అవుతున్న సమంత.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్)

మయాసైటిస్ వల్ల
సౌత్ సినిమాలతో సమంత స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. అయితే 'యశోద' మూవీ రిలీజ్ టైంలో తను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దాని చికిత్స కోసమే ఈ మధ్య అమెరికా కూడా వెళ్లింది. అయితే ఈ జబ్బు కారణంగా సమంత ఆహార అలవాట్లు చాలా మారిపోయాయి.

బ్రెడ్ ముక్క కోసం
ఇకపోతే దాదాపు ఏడాది 4 నెలల తర్వాత బ్రెడ్ తిన్నానని చెబుతూ సమంత.. తన ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. దీన్ని చూసిన ఆమె ఫ్యాన్స్.. సామ్‌కి ఎంత కష్టమొచ్చిందోనని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే గతనెలలో 'ఖుషి' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన సామ్.. త్వరలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో రాబోతుంది. ఇది కాకుండా కొత్త ప్రాజెక్టులు అయితే ఇంకా ఏం ఒప్పుకోలేదని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఖరీదైన తప్పులు చేశాం.. 'భోళా శంకర్' నిర్మాత షాకింగ్ ట్వీట్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement