నమ్మకానికి ప్రతిరూపంగా సేవలందిస్తాం | A replica of the belief sevalandistam | Sakshi
Sakshi News home page

నమ్మకానికి ప్రతిరూపంగా సేవలందిస్తాం

Published Sun, Mar 22 2015 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

A replica of the belief sevalandistam

పోచమ్మమైదాన్ : వ్యాపారానికి  పునాది నమ్మకం... దానికి ప్రతిరూపంగా సేవలందిస్తామని కంది గ్రూప్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్‌లో, కేయూ క్రాస్ రోడ్‌లో, కాజీపేటలోని ఫాతిమా కాంప్లెక్స్‌లో, వరంగల్ పోచమ్మమైదాన్‌లోని జకోటియా కాంప్లెక్స్‌లో, హెడ్ పోస్టాఫీస్ సమీపంలో ఐదు కంది చిట్‌ఫండ్స్ బ్రాంచిలను శనివారం ఏకకాలంలో ప్రారంభించారు. పోచమ్మమైదాన్‌లోని జకోటియా కాంప్లెక్స్‌లో వరంగల్-1 బ్రాంచ్‌ను ఐసీఏఐ వరంగల్ చెర్మైన్, ప్రముఖ సీఏ పీవీ నారాయణరావు చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ చిట్ ఫండ్స్ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన, 20 ఏళ్ల అనుభవం ఉన్నవారి పర్యవేక్షణలో నడుస్తున్న సంస్థ కంది చిట్స్ అని అన్నారు. చిట్స్ యూక్షన్ తేదీ నుంచి 15 రోజుల్లో చిట్ డబ్బులు చెల్లిస్తూ... అందరి నమ్మకాన్ని కార్యరూపంలో నిజం చేస్తూ ముందుకు సాగుతామన్నారు. ఉన్నత ప్రమాణాలు, విలువలతో కూడిన సేవలను వరంగల్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందించేలా కంది చిట్‌ఫండ్స్ సంస్థలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. చిట్ మెంబర్ల సహాయ సహకారాలతోపాటు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామన్నారు.

ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ నారాయణరావు  మాట్లాడుతూ కంది చిట్ ఫండ్స్ జిల్లా ప్రజలకు మరిన్ని సేవలందిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రే వూరి ప్రకాష్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ఐరన్ అండ్ హార్డ్‌వేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దామోదర్, తెలంగాణ కాటన్ ఇండ్రస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త కంది రవీందర్‌రెడ్డి, కంది చిట్‌ఫండ్స్ సీఈఓ రమణారెడ్డి, తేజస్వీ స్కూల్ కారస్పాండెంట్ జెన్నారెడ్డి, మట్టెవాడ సీఐ శివరామయ్య,  చిట్ ఫండ్ జీఎం, బీఎంలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement