'టైంపాస్ రొమాన్స్ నమ్ముతా'
ముంబయి: తాను టైంపాస్ రొమాన్స్ను నమ్ముతానని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటోంది. ఆమె నటిస్తున్న 'కట్టి భట్టి' చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె ఆ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడారు. ఈ సినిమాలో మాత్రం ప్రేమ మీద, లివ్ ఇన్ రిలేషన్ షిప్ మీద నమ్మకం లేని పాత్ర తనదని, అయితే, నిజ జీవితంలో ఇందుకు విరుద్ధంగా ఉండటానికే ఇష్టపడతానని ఆమె చెప్తోంది.
ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించి డేటింగ్కు వెళతారని, ఆ సమయంలో మాత్రం పెళ్లి ఆలోచన మనసులో ఉండదని, దాంతో అభిప్రాయ బేధాలు వస్తే ఎలాంటి బాధ లేకుండానే విడిపోవచ్చని చెప్పింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ విషయంలో తన అభిప్రాయం చెప్పేటప్పుడు తాను చాలా ఓపెన్ గా ఉంటానని చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ తో టైంపాస్ అఫైర్ విషయంలో కూడా చాలా ఓపెన్ గా ఉంటానని, కలిసి చిత్రంలో నటిస్తున్నప్పుడు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంలో తప్పేముంటుందని అంటోంది ఈ అమ్మడు.