కరోనా కారణంగా గతేడాది సినిమాల రిలీజ్‌ను ఆగిపోవడంతో.. అంతా ఈ ఏడాదిపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు షూటింగ్ జరుపుకుంటునే.. విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్‌లో గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. ముఖ్యంగా బడా హీరోల మధ్య ఈ ఏడాది బాక్సాఫీస్ వార్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఒకే నెలలో నలుగురు బడా హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’(మే13), విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’(మే14), మాస్ మహారాజా రవితేజ‘ఖిలాడి’(మే28) సినిమాల విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించారు.
ఇప్పుడు తాజాగా ఈ బాక్సాఫీస్ వార్‌లోకి నందమూరి బాలకృష్ణ కూడా దూసుకొచ్చాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘బీబీ3’ మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. దీంతో చాలా రోజులు తర్వాత టాలీవుడ్ బడా హీరోలు చిరు, బాలయ్య, వెంకటేశ్‌లు కలిసి ఒకే నెలలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 90లలో మాత్రమే సాధ్యమైన ఫీట్ మళ్లీ ఇన్నాళ్టికి కనిపిస్తోంది
చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ సమయంలోనూ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చిరుతో ఢీ కొట్టారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి చిరుతో బాక్సాఫీస్ వార్‌కు సిద్దమయ్యాడు బాలయ్య బాబు. కాకపోతే ఈ సారి వీరిద్దరి సినిమాల విడుదలకు రెండు వారాల గ్యాప్ ఉండడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఇక చిరంజీవి, వెంకటేశ్ ఒక రోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నారు. ఆచార్య మే 13న విడుదల అవుతుండగా, నారప్ప మే 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య సినిమా రిలీజ్ రోజే రవితేజ ‘ఖిలాడి’ విడుదల కాబోతుంది. వీరిద్దరివి మాస్ సినిమాలే కాబట్టి ఆ మేరకు కలెక్షన్స్ పరమైన షేరింగ్ ఉంటుందని భావిస్తున్నారు. సమ్మర్‌లో జరగబోయే బాక్సాఫీస్ వార్‌లో ఏ హీరో విజేతగా నిలుస్తాడో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment