Narappa Movie Updates: Venkatesh Narappa Movie First Copy Will Ready In One Week - Sakshi
Sakshi News home page

నారప్ప రెడీ అవుతున్నాడు

Published Wed, Jun 16 2021 7:50 AM | Last Updated on Wed, Jun 16 2021 10:30 AM

Narappa: First Copy Will Ready In One Week - Sakshi

వెంకటేశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటించారు. సురేష్‌ బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు వెంకటేశ్‌.

ఇంతవరకూ చూడని కొత్త అవతారంలో ఆయన్ను చూపించనున్నారు శ్రీకాంత్‌ అడ్డాల. "వారం రోజుల్లో నారప్ప ఫస్ట్‌ కాపీ రెడీ అవుతుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌, పోస్టర్స్‌తో పాటు వెంకటేశ్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కు మంచి స్పందిన లభించింది అన్నారు" శ్రీకాంత్‌ అడ్డాల. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌ డొంకాడ, కో ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌.

చదవండి: Narappa Movie: వెంకటేష్‌ 'నారప్ప' రిలీజ్‌ వాయిదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement