![Cyberabad Traffic Police Using Narappa Movie Poster For Corona Awareness - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/23/narappa_0.jpg.webp?itok=ssFX1xJC)
ట్రాఫిక్ రూల్స్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. ట్రెండ్‌ని ఫాలో అవుతూ తమదైన శైలీలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ముఖ్యంగా కరోనాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో కరోనా పూర్తిగా తొలగి పోలేదని.. ఇంకా ఉందని.. అందరూ జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించాలని గుర్తు చేస్తున్నారు. మాస్కులు కచ్చితంగా ధరించాలని గుర్తు చేస్తున్నారు.
కరోనాపై అవగాహన కోసం తాజాగా ‘నారప్ప’సినిమా డైలాగ్‌ని వాడేసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. నారప్ప సినిమా పోస్టర్‌లోని వెంకటేష్ ముఖానికి మాస్క్ తగిలించి‘ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. మాస్క్ పెట్టుకో సిన్నప్పా, కరోనా ఇంకా ముగిసిపోలేదు’అంటూ మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా, గతంలోనూ ఆర్ఆర్ఆర్ పోస్టర్ విడుదల కాగా, బైక్‌పై ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని.. వారి పోస్టర్‌కు హెల్మెట్ అమర్చి, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు.
Don't forget your mask. COVID-19 is still awake. #Narappa
— Cyberabad Police (@cyberabadpolice) July 22, 2021
Always #WearAMask when stepping out. #StaySafe #covid19 #MaskUpIndia pic.twitter.com/S3eEoquPCn
Comments
Please login to add a commentAdd a comment