విక్టరీ వెంకటేశ్ హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిన చిత్రం 'నారప్ప'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే 'నారప్ప' ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. అందుకే విక్టరీ వెంకటేశ్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న 'నారప్ప' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత సురేష్ బాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. రీరిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్లలో ఒక్క పైసా కూడా తాము తీసుకోబోమని, అదంతా చారిటీకి అందచేస్తామని చెప్పారు.
‘డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్ ని ఒక ఈవెంట్ లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. ఈ నేపధ్యంలో ఏ సినిమా వేద్దామని ఆలోచిస్తుంటే అభిమానులు నారప్పని థియేటర్ లో చూడాలని ఉందని కోరారు. దీంతో బర్త్ డే సందర్భంగా ఒక రోజు థియేటర్ లో వేస్తామని అమెజాన్ కి రిక్వెస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. ఒక్క రోజు మాత్రమే నారప్ప థియేటర్స్‌లో ప్రదర్శితమవుతుంది. రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ఇందులో వచ్చే రెవెన్యూ మేము తీసుకోమని చెప్పాం. ఇందులోఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని చారిటీకే ఇచ్చేస్తాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment