Narappa: విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’. తమిళ మూవీ ‘అసురన్’కి తెలుగు రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది.మణి శర్మ సంగీతం అందించారు. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ప్రస్తుతం వెంకటేశ్ ‘నారప్ప’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నారప్ప’గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చదివేయండి.
మీ కెరీర్‌లోనే ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా ‘నారప్ప’. దీనిపై మీ స్పందన ఏంటి?
అవును ఎవరికైనా కొన్ని ఫస్ట్ థింగ్స్ ఉంటాయి. అలాగే ఇది కూడా నా లైఫ్‌లో మొదటి అనుకుంటాను.
‘నార్పప్ప’ఓటీటీలో విడదలఅవ్వడంపై మీ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయినట్టున్నారు?
అవును. కానీ ప్రస్తుతం ఉన్న టైం వల్ల అలా జరిగింది. ఓటీటీలో విడుదల అవడం వల్ల కొంతమంది ఫాన్స్ హ్యాపీగా ఫీలైతే, మరికొంతమంది బాధపడుతున్నారు. కానీ టైం వల్ల ఇలా జరిగింది. అప్పటి నుంచి నన్ను కానీ, నా సినిమాలని కానీ ఆదరిస్తున్నవారందరికీ నారప్ప సినిమా రిలీజ్ పై చాలా సిన్సియర్ గా సారీ చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలో అభిమానులు అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాంటి ఫ్యాన్స్ నాకు దక్కడం నిజంగా అదృష్టంగా భావిస్తాను.
అసురన్ రీమేక్ చేయడానికి మిమ్మల్ని కనెక్ట్ చేసిన అంశం ఏంటి?
మొదటగా నేను ధనుష్‌కి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ ని హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇచ్చినందుకు. ఇది చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది. నాకే ఛాలెంజింగ్ గా ఉంటుంది అనిపించింది. అందుకే నా కెరీర్ రీమేక్ సినిమాలు ఎక్కువ కనిపిస్తాయి. అందరూ అదే అడుగుతారు ఎందుకు రీమేక్ సినిమాలు ఎక్కువ అని. నేనేమి కావాలని చెయ్యను అలా జరుగుతుంది అంతే. చంటి, సుందరకాండ లాంటి సూపర్ హిట్ సినిమాలు అన్ని రీమేక్ చిత్రాలే. అలా అని రీమేక్స్ చెయ్యడం అనేది చిన్న విషయం కూడా కాదు ఆల్రెడీ హిట్టయిన సినిమాని వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మళ్ళీ హిట్టయ్యేలా చెయ్యడం అనేది చాలా రిస్క్ తో కూడుకుంది.
‘నారప్ప’ మీకెంత ఛాలెంజింగ్ గా అనిపించింది?
నిజంగా నారప్ప నాకు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. లుక్ కానీ, ఎమోషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ అని ఛాలెంజింగ్‌గానే అనిపించాయి. నేను అలాంటి యాక్టర్ ని కాదు కానీ ఈ సినిమాకి ఎందుకో అలా చేయాలనిపించింది. ఒక 50 రోజులు అదే ఓ కాస్ట్యూమ్ తో హోటల్ రూమ్ లో ఉన్నాను. చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా తీశాను.
‘అసురన్’ లో ధనుష్ కి నారప్ప లో మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది దాన్ని ఎలా చూపించగలరు?
ఏదైనా సరే ఫైనల్గా అతను ధనుష్, నేను వెంకటేష్. అతను కూడా అవుట్ స్టాండింగ్ జాబ్ ఇచ్చాడు. ఇక్కడ నారప్ప ఎమోషన్స్ ఏంటి అన్నది ముఖ్యం అది నేను చూపించాను అందుకే కదా అన్నా చాలా కష్టంగా ఈ రోల్ అనిపించింది అని.
ఒరిజినల్ కి ‘నారప్ప’ కి కంపేరిజన్స్ ఏమన్నా ఉన్నాయా?
ఖచ్చితంగా.. ఏ రీమేక్ సినిమాకి అయినా కంపేరిజన్ అనేది ఉంటుంది. నా సినిమాలు సుందరాకాండ, చంటి సినిమాల నుంచే చాలానే మార్పులు ఉంటాయి. అలాగే నారప్ప కి కూడా కావాల్సిన చేంజెస్ చాలానే చేశాం. అలాగే సినిమాలో అందరు యాక్టర్స్ కూడా చాలా బాగా చేసారు అది రేపు మీకు కనిపిస్తుంది.
ముందు మీ యంగ్ రోల్ కి చాలా మంది యాక్టర్స్ పేర్లు వినిపించాయి, రానా చేస్తున్నాడని కూడా పుకార్లు వచ్చాయి?
ఎలా చేస్తాడమ్మా ఇలాంటి వాటిలో? అలా ఏమి లేదు అవన్నీ జస్ట్ టాక్స్ మాత్రమే అవన్నీ ఎవరో అనడం మళ్ళీ మీరు నన్ను అడగడం. అలా ఏమి మేము అనుకోలేదు.
మణిశర్మ గారి సంగీతం కోసం ఏమన్నా చెప్పండి?
మణిశర్మతో నా మొదటి సినిమా నుంచి కూడా మంచి మ్యూజిక్ ఇస్తూనే ఉన్నాడు, అలాగే ఈ సినిమాకి కూడా మంచి స్కోర్ ఇచ్చాడు.
గడిచిన కొన్నేళ్లలో కొత్త కథలు వస్తున్నాయి రీమేక్స్ అవసరం లేదు అన్నది కొందరి మాట..
ఎవరన్నారు? నా వరకు అయితే రాలేదు. మనం చేసేది ఏదైనా సరే కరెక్ట్ గా సిన్సియర్ గా చేసుకెళ్లిపోవాలని నేను అనుకుంటా.
ఇప్పుడు నడుస్తున్న ఓటిటి డామినెన్స్ పై మీ అభిప్రాయం?
టైం చాలా త్వరగా మారిపోయింది, సో ఇప్పుడు ఓటిటి హవా నడుస్తుంది. ఒకవేళ కరోనా కానీ తగ్గిపోతే మళ్ళీ ఖచ్చితంగా థియేటర్స్ అన్నీ తెరుచుకుని మొదటిలా మారుతుంది.
ఇక ఈ సినిమా చూశాక మీకేం అనిపించింది?
నాకు అయితే చాలా బాగా అనిపించింది. నా కెరీర్ లో ది బెస్ట్ ఈ సినిమాకి ఇచ్చా అనిపించింది. కొన్ని ఎమోషన్స్ అవన్నీ మీరు చూస్తారు. ఒక ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అలా తీసుకొనే నారప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాక ఫ్యాన్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా కూడా ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది.
వెంకటేశ్ బాబు స్క్రీన్ మీద కంటతడి పెడితే ఆ సినిమా సూపర్ హిట్. నారప్పలో అలాంటి సీన్స్ ఉన్నాయా? ఎలా చేశారు?
నాకు ఎమోషన్ సీన్స్ అలా వచ్చాయి. నా కెరీర్ బిగినింగ్‌లో ఏడిసే సీన్స్ వస్తే.. ఆపురా బాబూ అన్నారు. ధైర్యం ఉంటే కెమెరా ముందు ఏడవమన్నారు. తర్వాత ధర్మచక్రం సినిమాల్లో అమ్మాయి చనిపోయే సీన్‌లో నిజంగానే కెమెరా ముందు ఏడ్చేశాను. ఆ సీన్ బాగా పండింది. అప్పటి నుంచి అలా అలా.. వచ్చేశాయి. నారప్పలో కూడా ఏడిపించేశాను. సినిమా చూడండి.
వంద సినిమాలు చేస్తారా సర్?
మన చేతుల్లో ఏమీ లేదు. నెంబర్లు ఆలోచించకూడదు. (నవ్వుతూ) కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఏం వద్దు అన్నారు. కట్ చేస్తే.. మళ్లీ అంత మాములే. మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల వివాదం గురించి?
ఏదీ మన చేతుల్లో లేదు. ఏదైనా జరగొచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ల నేపథ్యంలో జరిగే విమర్శలు, మాటల తూటాలు శాశ్వతం కాదు
Comments
Please login to add a commentAdd a comment