New Movies On OTT This Week July 2021 - Sakshi
Sakshi News home page

OTT: ఈ వారం రిలీజ్‌కు రెడీ అయిన సినిమాలివే!

Jul 19 2021 5:22 PM | Updated on Jul 19 2021 7:56 PM

New Movies On OTT This Week July 2021 - Sakshi

ఇప్పుడు ఎక్కడ చూసినా ఓటీటీ పేరే వినిపిస్తోంది. థియేటర్లు ఇంకా తెర తీయకపోడంతో జనాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం దీన్నే నమ్ముకుంటున్నారు. ఇక బుల్లితెర మీద ప్రసారమయ్యే సీరియళ్లు కూడా కొన్ని గంటల ముందే ఓటీటీలో రెడీగా ఉండటంతో టీవీ ఆడియన్స్‌ కూడా ఈ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కు జై కొడుతున్నారు. అటు సినిమాలు కూడా దీంట్లోనే రిలీజ్‌ అవుతుండటంతో సినీ ప్రియులు కూడా ఓటీటీనే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతివారం కొత్త సరుకును దింపుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయో చూసేద్దాం..

నారప్ప
శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించాడు. వెంకటేశ్‌, ప్రియమమణి, కార్తీకర్‌ రత్నం, వశిష్ట సింహ ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళంలో ధనుష్‌ నటించిన అసురన్‌కు రీమేక్‌గా వచ్చిందీ చిత్రం. ఇది జూలై 20న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది.

సార్‌పట్ట
యంగ్‌ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా సార్‌పట్ట. పా రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్‌ చిత్రం కరోనా కారణంగా ఓటీటీ బాట పట్టింది. ఇది ఈ నెల 22న తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ ​కానుంది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించాడు.

ఇక్కత్‌
నాగభూషణ్‌, భూమి శెట్టి, సుందర్‌ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ఇక్కత్‌. విడాకులు తీసుకోవాల్సిన జంట అనుకోని కారణాల వల్ల ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. మరి ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏం జరిగింది? అనేదే ఇక్కత్‌. ఈ కన్నడ చిత్రం ఈ నెల 21 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.

14 ఫెరే
విక్రాంత్‌ మాస్సే, కృతి కర్బందా జంటగా నటించిన సినిమా 14 ఫెరే. దేవన్షు సింగ్‌ డైరెక్టర్‌.  ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఓ ప్రేమజంట. ఈ క్రమంలో వారు పడే పాట్లు కామెడీగా ఉంటాయట. ఈ చిత్రం జూలై 23 నుంచి జీ 5లో అందుబాటులోకి రానుంది.

ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌
ఆరుగురు డైరెక్టర్లు ఆరు కథలను అందించిన వెబ్‌ సిరీస్‌ ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌. ఇది జూలై 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

హంగామా 2
2003లో వచ్చిన హిట్‌ చిత్రం హంగామాకు సీక్వెల్‌గా వస్తోంది "హంగామా 2".  13 ఏళ్ల తర్వాత శిల్పాశెట్టి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. ఇది హాట్‌స్టార్‌లో జూలై 23న రిలీజ్‌ అవుతోంది.

వీటితోపాటు కింది సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా ప్రసారం కానున్నాయి..

ద లాస్ట్‌ లెటర్‌ ఫ్రమ్‌ యువర్‌ లవర్‌ (జూలై 23, నెట్‌ఫ్లిక్స్‌)
హాస్టల్‌ డేస్‌ సీజన్‌ 2 (జూలై 23, అమెజాన్‌ ప్రైమ్‌)
కింగ్‌డమ్‌: అషైన్‌ ఆఫ్‌ ద నార్త్‌ (జూలై 24, నెట్‌ఫ్లిక్స్‌)
స్కై రోజో సీజన్‌ 2( జూలై 24, నెట్‌ఫ్లిక్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement