వీకెండ్‌లో సినిమాల జాతర..ఓటీటీల్లో ఒక్కరోజే 7 చిత్రాలు స్ట్రీమింగ్! | This Weekend OTT Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

This Weekend Ott Releases: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 7 చిత్రాలు స్ట్రీమింగ్!

Apr 4 2024 10:05 PM | Updated on Apr 5 2024 9:20 AM

This Weekend Ott Release Movies List Goes Viral - Sakshi

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. వేసవి సెలవులు రావడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ హాలీడేస్‌లో ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేదందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్‌ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం మాయవన్‌ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్‌లో ప్రాజెక్ట్‌-జెడ్ పేరుతో రిలీజవుతోంది. వీటితో పాటు భరతనాట్యం, సస్పెన్స్‌ థ్రిల్లర్ మూవీ బహుముఖం లాంటి చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. 

‍అయితే ఈ వీకెండ్‌లో ఓటీటీలోనూ సందడి చేసేందుకు భీమా, హనుమాన్‌ రెడీ అయిపోయాయి. గోపీచంద్ నటించిన భీమా, హనుమాన్ మూవీ తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో సందడి చేయనుంది. దీంతో పాటు బాలీవుడ్ మూవీ ఫర్రీ ఓటీటీకి వచ్చేస్తోంది. అంతే కాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందో మీరు ఓ లుక్కేయండి. 
  

నెట్‌ఫ్లిక్స్‌

  •  పారాసైట్- ది గ్రే(కొరియన్ సిరీస్)- ఏప్రిల్  05
  •  స్కూప్- హాలీవుడ్ సినిమా- ఏప్రిల్ 05

అమెజాన్ ప్రైమ్

  •     హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్- (హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  •   భీమా (టాలీవుడ్ చిత్రం) -ఏప్రిల్ 05
  •   హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05

జీ5

  •     ఫర్రీ- (బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05

యాపిల్ టీవీ ప్లస్

  •     సుగర్(హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement