
నారప్ప ప్రయాణం పూర్తయింది. ఈ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే మే 14వరకూ ఆగాల్సిందే. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. కలైపులి యస్.థాను, సురేశ్ బాబు నిర్మించారు. ప్రియమణి కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. మే 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు వెంకటేశ్. మణిశర్మ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment