సన్నీ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్... | Sunny's film 'A' certificate ... | Sakshi
Sakshi News home page

సన్నీ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్...

Published Sat, Aug 29 2015 10:40 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సన్నీ సినిమాకి  ‘ఎ’ సర్టిఫికెట్... - Sakshi

సన్నీ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్...

 గాసిప్
 
బాలీవుడ్ సినిమాల హాట్ స్టార్... సన్నీలియోన్ కొత్త సినిమాలకు చిక్కులు తొలగినట్టేనా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. తరచుగా సెన్సార్ కత్తెరకు పనిపెట్టే సన్నీ కొత్త సినిమా ‘మస్తీజాదే’ డిసెంబరులో షూటింగ్ పూర్తి చేసుకుంది.  గత మే నెలలోనే విడుదల కావాల్సింది. అయితే సెన్సార్ ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ సినిమాలో శృతిమించిన శృంగారం, అందాల ఆరబోత ఉన్నాయని భావించిన సెన్సార్ విడుదలకు అనుమతించాలంటే  బోలెడన్ని కట్స్ సూచించిందట. అయితే అసలే సన్నీ సినిమా అంటూ ఎంతో ఆశగా వచ్చే యువ ప్రేక్షకులను నిరాశపరచకూడదనేమో... సినిమా నిర్మాతలు దీనికి ససేమిరా అన్నారట.

మొత్తానికి వీరి మధ్య చోటు చేసుకున్న వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టేనని బాలీవుడ్ టాక్. ఇవాళో రేపో ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్‌తో సెన్సార్ అనుమతించనుందని సమాచారం. రితేష్ దేశ్‌ముఖ్, తుషార్ కపూర్, వీర్‌దాస్ తదితరులు ప్రముఖ పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ప్రీతిష్, రంగిత నందిలు నిర్మిస్తున్నారు. పూర్తిగా అడల్ట్ కామెడీ అని బాలీవుడ్ వర్గాలు వర్ణిస్తున్న ఈ సినిమా ఎంత హాట్‌గా ఉంటుందో త్వరలో తేలనుంది.
 - ఎస్బీ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement