ఈ సారి న్యూ ఇయర్‌కి కిక్ ఇవ్వడానికి చాలా మంది సెలబ్రిటీలే రంగంలోకి దిగనున్నారు. అయితే ఈ జాబితాలో తొలిగా వెలుగు చూసింది సన్నీలియోన్ పేరు. ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ...నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ ప్రియులతో కలిసి డిసెంబర్ 31న.. 2015కి వెల్‌కమ్ పలకనున్నారు.
బాలీవుడ్ స్టార్స్ గురించి సిటీలోని పలు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు పోటీపడుతుంటే ఆర్‌ఎన్‌హెచ్ ఈవెంట్స్ సన్నీ సందడిని చేజిక్కించుకుంది. సిటీలో జరిగే ఈవెంట్లలో తమదే బిగ్గెస్ట్ అంటూ ఆర్గనైజర్స్ అంటున్నారు.
ఇక ఈ మాజీ పోర్న్‌స్టార్ డ్యాన్సులకు నేపథ్యాన్ని టాప్ డీజే ఎన్‌వైకే, డీజే కిమ్ థామస్‌లు అందించనున్నారు. ఈ ఈవెంట్‌కి అప్పుడే పార్టీ సర్కిల్‌లో మంచి టాక్ రావడంతో మిగిలిన వారూ పోటా పోటీగా సెలబ్రిటీలను రప్పించనున్నారని సమాచారం. సో.. ఫ్రెండ్స్.. గెట్ రెడీ ఫర్ ది హాట్‌నైట్స్
..:: ఎస్బీ
హైదరాబాద్లో సన్నీ లియోన్ సందడి
Published Thu, Dec 18 2014 4:25 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement