ఎక్కేశారు... చెక్కేశారు | TOLLYWOOD WOLLYWOOD NEW YEAR CELABRATIONS SPECIAL 2018 | Sakshi
Sakshi News home page

ఎక్కేశారు... చెక్కేశారు

Published Sun, Dec 31 2017 1:17 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

TOLLYWOOD WOLLYWOOD NEW YEAR CELABRATIONS SPECIAL 2018 - Sakshi

టాలీవుడ్‌ సగం ఖాళీ. అటు బాలీవుడ్‌ పరిస్థితీ అంతే. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం ఫై్లట్‌ ఎక్కేసి కొందరు విదేశాలు చెక్కేస్తే.. కొందరు ఇండియాలో ప్లాన్‌ చేసుకున్నారు. పార్టీలు చేసుకోవడానికి పక్కాగా రెడీ అయిపోయారు. కొంతమంది అందాల భామలు మాత్రం న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌ లోకాలు కదపడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఎవరెవరు ఎక్కడెక్కడ? రండి తెలుసుకుందాం.

విదేశాల్లో వెల్కమ్‌
సంక్రాంతి అంటే చాలు.. మెగా కుటుంబం బెంగళూరు వెళ్లిపోతుంది. మొత్తం 50 మంది వరకూ అక్కడికి వెళ్లి, తమ ఫామ్‌హౌస్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటారు. వచ్చే సంక్రాంతికి ఎప్పటికలా బెంగళూరు వెళతారో లేదో కానీ, న్యూ ఇయర్‌ డెస్టినేషన్‌ మాత్రం దుబాయ్‌ అని సమాచారం. చిరంజీవితోపాటు రామ్‌చరణ్‌ ఫ్యామిలీ అంతా దుబాయ్‌లో వెళ్లారని తెలిసింది.

అలాగే సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఒమన్‌లో ఉన్నారు. అక్కడ సబీనా, గ్జేవియర్‌ దంపతుల వెడ్డింగ్‌ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో దిగిన ఫొటోను మహేశ్‌ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇంతకీ సబీనా, గ్జేవియర్‌ ఎవరంటే.. నమ్రతకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. న్యూ ఇయర్‌కి మహేశ్‌ దంపతులు ఒమన్‌లోనే స్వాగతం పలుకుతారు. జనవరి ఫస్ట్‌ వీక్‌లో ఇండియా వస్తారట.

‘జై లవ కుశ’ తర్వాత కొత్త సినిమా షూటింగ్‌ ఇంకా మొదలుపెట్టలేదు ఎన్టీఆర్‌. లాంగ్‌ బ్రేక్‌ తీసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి లండన్‌లో ఉన్నారని భోగట్టా. ఇంకొన్ని రోజుల పాటు హాలిడేస్‌ని ఎంజాయ్‌ చేసి, ఆ తర్వాత త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోతారు ఎన్టీఆర్‌.

ఇక.. బాహుహలి.. అదేనండి... ప్రభాస్‌ లాస్‌ ఏంజిల్స్‌లో ఉన్నారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కంప్లీట్‌ అవ్వగానే జనవరి 5 నుంచి హైదరాబాద్‌లో జరిగే ‘సాహో’ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌లో పాల్గొంటారని సమాచారం.

మరోవైపు హీరోయిన్‌ పూజా హెగ్డే న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు లండన్‌ వెళ్లారు. ఇక.. రత్తాలు.. రత్తాలు అంటూ ఈ ఏడాది కుర్రకారును హుషారెత్తించిన రాయ్‌ లక్ష్మీ ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్నారు. న్యూ ఇయర్‌ని అక్కడే సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇలా విదేశాల్లో ఇంగ్లిష్‌ న్యూ ఇయర్‌ని వెల్‌కమ్‌ చేస్తున్న మన తారలు చాలామందే ఉన్నారు.
 

గో.. గో.. గోవా
కొందరు తారలు మాత్రం విదేశాలు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. ఎంజాయ్‌మెంట్‌కి ‘గోవా’ బెస్ట్‌ అనుకున్నారేమో! అందుకే చాలామంది స్టార్స్‌ ‘గో.. గో.. గోవా’ అంటూ అక్కడ వాలిపోయారు. పార్టీలకు, పబ్బులకు, నైట్‌ క్లబ్‌లకు హెవెన్‌లాంటి గోవాలో ‘న్యూ ఇయర్‌’కి వెల్‌కమ్‌ చెప్పబోతున్నారు. సండే నైట్‌ సందడి కోసం ఫ్రైడేనే ఫ్లై అయ్యారు. ఇంతకీ గోవా ఎగిరిపోయిన స్టార్స్‌ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే.. రకుల్‌ ప్రీత్‌సింగ్, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి, ప్రగ్యా జైస్వాల్, హెబ్బా పటేల్‌. ఓన్లీ హీరోయిన్సేనా? నో..నో.. హీరోలూ ఉన్నారు. రవితేజ, అల్లు అర్జున్, రానా, సుశాంత్, అఖిల్‌ కూడా గోవా సెలబ్రేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నారు. గోవాలో మూడు ముళ్ల బంధంతో ఒకింటివాళ్లైన నాగచైతన్య–సమంత న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి కూడా ఆ ప్లేస్‌నే సెలక్ట్‌ చేసుకున్నారు. మ్యారేజ్‌ మెమరీస్‌ని రీ కలెక్ట్‌ చేసుకోకుండా ఉండలేరు.

నో హాలిడే
ఇయర్‌ ఎండింగ్‌లో కొందరు తారలకు ‘నో హాలిడే’. ఈవెంట్స్‌లో పాల్గొంటూ, బిజీ బిజీగా గడపబోతున్న తారలు ఎవరెవరంటే...
మిల్కీ బ్యూటీ తమన్నా  ‘స్వింగు జరా స్వింగ్‌’ అంటూ వెండితెర మీద స్టెప్పులేస్తే థియేటర్లో ఫ్యాన్స్‌ స్వింగ్‌ అయ్యారు. ఇక, ఈ బ్యూటీ డైరెక్ట్‌గా మన కళ్ల ముందు డ్యాన్స్‌ చేస్తే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. బాసూ.. తమన్నా డ్యాన్సు ఎక్కడ అంటున్నారా? విజయవాడలో. హాయ్‌ అంటూ అభిమానులను ‘హాయ్‌ల్యాండ్‌’లో పలకరించనున్నారు తమన్నా. అక్కడ జరిగే ఈవెంట్‌లో ఈ పాలబుగ్గల సుందరి స్టెప్పులు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. అలాగే కైరా దత్‌ కూడా అదే ప్లేస్‌లో హాయ్‌ చెప్పనున్నారు. ‘రేసు గుర్రం’లో ‘బూచోడే... బూచోడే.. భూమ్‌.. భూమ్‌ చేస్తాడే’, ‘పైసా వసూల్‌’లో ‘వసూలు వసూలు వసూలు..’ సాంగ్‌లో కైరా వేసిన స్టెప్స్‌కు చాలామంది ఫిదా అయ్యారు. ఓన్లీ ఈ ఇద్దరే కాదు.. బబ్లీ బ్యూటీ మెహరీన్‌ కూడా అదే ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేయబోతున్నారు. .

 ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ’ అంటూ ఫ్లాట్‌ చేసిన ముమైత్‌ ఖాన్‌ కూడా న్యూ ఇయర్‌ ఈవెంట్‌లో స్టెప్పులేయనున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో  కాలు కదిపి హుషారెత్తించడానికి రెడీ అయ్యారు.

ఇంకా తెలుగు స్క్రీన్‌పై కనిపించని కియారా అద్వానీ కూడా తెలుగు రాష్ట్రంలో సందడి చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. హిందీలో ‘ఫగ్లీ, ఎం.ఎస్‌. ధోని, మెషీన్‌’ అనే చిత్రాల్లో నటించిన ఈ 27 ఏళ్ల అందం హ్యాండ్‌సమ్‌ హీరో మహేశ్‌బాబు సరసన ఓ చిత్రం (‘భరత్‌ అనే నేను’ పరిశీలనలో ఉంది)లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేయనున్నారు.
 

ఆమిర్‌ చలే థాయ్‌ల్యాండ్‌
ఆమిర్‌ ఖాన్‌ థాయ్‌ల్యాండ్‌కు బయలుదేరి వెళ్లిపోయాడు. అతని కుటుంబం బహుశా అతణ్ణి ఇవాళో రేపో చేరుకుంటుంది. రణ్‌వీర్‌ కపూర్‌ని చూసి ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్‌ గుమిగూడారు. కొంచెం హల్‌చల్‌ వేషధారణలో ఉన్న అతడు ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగి శ్రీలంకకు చక్కాపోయాడు.

ఇంకా చాలామంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈసారి న్యూ ఇయర్‌ వేడుకల కోసం విమానాలు ఎక్కారు. ఈ దేశంలో వారికి తగిన ప్రైవసీ లేకపోవడం, లేదా ఈ దేశంలో చూడదగ్గ ప్రదేశాలు లేకపోవడం వల్లనో ఏమో అందరూ ఫారిన్‌ లొకేషన్లలో హుషారును వెతుక్కుంటూ వెళ్లిపోయారు.

శ్రీలంక వైపు అందరి దృష్టి
ఈసారి ఆశ్చర్యకరంగా శ్రీలంకకు ఎక్కువమంది సెలబ్రిటీలు క్యూ కట్టారు. ‘పద్మావతి’ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్, జాకీ ష్రాఫ్‌ కుమారుడు టైగర్‌ ష్రాఫ్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, మరో హీరోయిన్‌ దిశా పాట్నీ శ్రీలంకకు ప్రయాణం అయిన వారిలో ఉన్నారు. ఎల్‌టిటిఇ సమస్య తీరాక శ్రీలంక టూరిజమ్‌ మీద విపరీతమైన దృష్టి పెట్టింది. ఇండియా నుంచి దగ్గర కావడం, అక్కడ లొకేషన్సు ఇంకా పర్యాటకుల బారిన పడి పాడుకాకుండా ఉండటంతో ఇప్పుడు ఎక్కువ మంది స్టార్స్‌ అటు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.

స్విట్జర్లాండ్‌ మంచులో తైమూర్‌
సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌ చలికి వెరవడం లేదు. స్విట్జర్లాండ్‌లో విపరీతమైన మంచు కురుస్తుంటే దానిని ఎంజాయ్‌ చేయడానికి తమ ముద్దుల కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌తో బయలుదేరి వెళ్లిపోయారు. వాళ్ల వెకేషన్‌ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక మరో స్టార్‌ జంట అక్షయ్‌కుమార్‌– ట్వింకిల్‌ ఖన్నా తమ ఇద్దరు కుమార్తెలతో కేప్‌ టౌన్‌లో ఉన్నారు. అక్కడి విశాలమైన దార్లలో భార్యను పక్కన కూచోబెట్టుకుని అక్షయ్‌ కారులో చక్కర్లు కొడుతున్నాడు. ఆలియా భట్‌ తన స్నేహితురాళ్లను తీసుకొని కొంచెం కొంచెం బట్టల్లో బాలీ దీవుల్లోని బీచ్‌ వొడ్డున షికార్లు చేస్తుండటం అభిమానులకు ముచ్చట కలిగిస్తున్నది. ఒక్క దీపికా పదుకోన్‌ మాత్రం ముఖాన్ని కవర్‌ చేసుకుని వియన్నా వీధుల్లో తిరుగుతుండటం కెమెరాల కంట పడింది. ఆమె ఒక్కర్తే వెకేషన్‌కు వెళ్లిందా ఫ్రెండ్స్‌ ఉన్నారా తెలియడం లేదు.

విరుష్క సౌత్‌ ఆఫ్రికాకు
పెళ్లయ్యాక ఇది మొదటి జనవరి ఫస్ట్‌. అందుకే విరాట్‌ అనుష్క (ఈ జంటకు నెటిజన్లు పెట్టిన పేరు ‘విరుష్క’) లు తమ న్యూ ఇయర్‌ పార్టీని దక్షిణాఫ్రికాలో ప్లాన్‌ చేశారు. విరాట్‌ కొద్దిమంది క్రికెట్‌ స్నేహితులను తోడు తీసుకుని ఈ ట్రిప్‌కు బయలుదేరాడు. ఇక దుబాయ్‌ కూడా ఈసారి హాట్‌ డెస్టినేషన్‌గా ఉంది. సన్ని లియోన్, జూహీ చావ్లా దుబాయ్‌లో థర్టీ ఫస్ట్‌ నైట్‌ను గడపబోతున్నారు. మరో సీనియర్‌ హీరోయిన్‌ మాధురి దీక్షిత్‌ భర్తతో జపాన్‌కు వెళ్లారు. జపనీస్‌ భాషలో విషెస్‌ వినబోతున్నారు. టెలివిజన్‌ క్వీన్‌ ఏక్తా కపూర్‌ మాత్రం అమెరికాలో ఫ్రెండ్స్‌తో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతోంది.
కొత్త సంవత్సరం వీరందరితో పాటు బాలీవుడ్‌కు మంచి విజయాలను ఇవ్వాలని కోరుకుందాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement