న్యూ ఇయర్‌ మూడ్‌.. పార్టీ మోడ్‌ | bollywood, tollywood actress new year celebration 2019 | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ మూడ్‌.. పార్టీ మోడ్‌

Published Tue, Jan 1 2019 3:51 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

bollywood, tollywood actress new year celebration 2019 - Sakshi

షూటింగ్‌లు, ప్యాకప్‌లు, లొకేషన్‌ చేంజ్‌లు, ప్రమోషన్‌లు, హిట్టూ, ఫ్లాప్, కొత్త సినిమా అగ్రిమెంట్‌లు, కాల్షీట్ల సర్దుబాట్లు... ఇలా ఒకటా? రెండా? ఎన్నో పనులతో ఆర్టిస్టులు ఉరుకుల పరుగుల జీవితం గడుపుతారు. అలాగే 2018 గడియారాన్ని తిప్పేశారు. ఇప్పుడు 2019కి వెల్‌కమ్‌ చెప్పడానికి ఫ్లైట్‌ ఎక్కి విదేశాలకు ఎగిరిపోయారు కొందరు తారలు. కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలతో న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేశారు. ప్రస్తుతానికి కొందరి లొకేషన్‌ ట్రేస్‌ అయ్యింది. వారి వివరాలపై ఓ లుక్కేద్దాం.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్‌కి ఆయన అక్కడే స్వాగతం పలుకుతారు. లోక నాయకుడు కమల్‌హాసన్‌ ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నట్లు కోలీవుడ్‌ సమాచారం. హీరో అల్లు అర్జున్‌ కూడా హాలీడేలో ఉన్నారు. ఇక నాగార్జున, ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అనుష్కతో పాటు మరికొందరు తారలు ఆదివారం జరిగిన రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లిసందడి కోసం జైపూర్‌ వెళ్లారు. మరి...న్యూ ఇయర్‌కి ఎవరెవరు ఏయే ప్లేస్‌లను సెలక్ట్‌ చేసుకున్నారనేది కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

కొత్త సంవత్సరాన్ని నాగచైతన్య, సమంత ఆమ్‌స్టర్‌డామ్‌లో గడపనున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ ‘హాయ్‌ అజర్‌ బైజాన్‌’ అంటూ అక్కడికెళ్లిపోయారు. సౌత్‌ క్రేజీ లవ్‌ జోడీ నయనతార, విఘ్నేష్‌ శివన్‌ లాస్‌ వేగాస్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఇక విజయ్‌దేవరకొండ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ని ఫోన్‌కి సిగ్నల్‌ కూడా రాని ఓ ఐల్యాండ్‌లో ప్లాన్‌ చేశారు. తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌ కోసం కాజల్‌ వియత్నాంలో ఉన్నారని సమాచారం. మరి కాజల్‌ అక్కడే న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెబుతారా? లేక వేరే డ్రీమ్‌ ప్లేస్‌ ఏదైనా ప్లాన్‌ చేశారా? అనే విషయం చూడాలి.

‘ఏంజిల్‌’ సినిమా కోసం ఫిజీ వెళ్లారు పాయల్‌రాజ్‌పుత్‌. పూజా హెగ్డే న్యూయార్క్‌లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. అల్లు శిరీష్‌ లెబనాన్‌లో ఉన్నారు. వియాత్నం వెళ్లారు రెజీనా. ఇజ్రాయెల్‌లో ల్యాండైపోయారు ప్రణీత. ఒకసారి బాలీవుడ్‌ డోర్‌ కొడితే... కొత్త దంపతులు ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లారు. కరీనా కపూర్, సైఫ్‌ అలీఖాన్‌ జంట కూడా స్విట్జర్లాండ్‌లోనే ఉన్నారు. దీపికా పదుకోన్‌–రణ్‌వీర్‌ సింగ్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ లండన్‌లో జరుగుతాయని బీ టౌన్‌ టాక్‌. భర్త విరాట్‌ కోహ్లీతో కలిసి సిడ్నీకి ఫ్లైట్‌ ఎక్కారు అనుష్కా శర్మ. సోనమ్‌ కపూర్, ఆనంద్‌ బాలీలో వాలారు.

థాయ్‌ల్యాండ్‌లో ఫ్యామిలీతో అజయ్‌ దేవగన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. చెల్లెళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ల కోసం అర్జున్‌ కపూర్‌ శనివారం సింగపూర్‌లో షాపింగ్‌ చేసి, ఆదివారం ముంబై వచ్చేశారు. కొత్త ఏడాదికి జాన్వీ కపూర్‌ తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ ఏడాది ఫుల్‌ రైజింగ్‌లో ఉన్న కియారా అద్వానీ మాల్దీవుల్లో మస్త్‌ మజా చేస్తున్నారు. దిశా పాట్నీ కూడా మాల్దీవుల్లోనే ఉన్నారట. బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ టర్కీలో ఉన్నారు. పరణీతీ చోప్రా లండన్‌లో వాలిపోయారు. మరికొంతమంది బాలీవుడ్‌ స్టార్స్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం ఫారిన్‌ పోదాం చలో చలో అంటూ అక్కడికెళ్లిపోయారు. ఇలా పలువురు తారలు హ్యాపీ మూడ్‌లో న్యూ ఇయర్‌ పార్టీ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

హాయ్‌ దుబాయ్‌!
న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం కొంతమంది హీరోయిన్లు దుబాయ్‌లో దిగిపోయారు. ఫ్యామిలీతో కలిసి మహేశ్‌బాబు దుబాయ్‌లో చిల్‌ అవుతున్నారు. స్నేహితురాలు వాణీ కపూర్‌తో కలిసి రాశీఖన్నా అక్కడే న్యూ ఇయర్‌ పార్టీ మోడ్‌లో ఉన్నారు. ఆలియా భట్, కత్రినా కైఫ్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నిధీ అగర్వాల్‌ల సెలబ్రేషన్స్‌ వేదిక కూడా దుబాయ్‌నే కావడం విశేషం. ఫ్యామిలీతో కలిసి సీనియర్‌ నటి ఖుష్బూ కూడా సేమ్‌ ప్లేస్‌లో ఉన్నారు. మరికొంతమంది కూడా దుబాయ్‌కు హలో చెప్పారట.


మహేశ్‌బాబు, నయనతార, విఘ్నేశ్‌, సాయిధరమ్‌, వాణీ కపూర్, రాశీ ఖన్నా


కరీనా, సైఫ్‌, ప్రియాంకా చోప్రా, తనయుడితో కాజోల్‌, ఆనంద్, సోనమ్‌, నిధీ అగర్వాల్‌


విరాట్, అనుష్కా, పూజా హెగ్డే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement